తూర్పు గోదావరి

కడియపులంక పూల మార్కెట్ కు ఉగాది సందడి…..



*భారీగా పెరిగిన ధరలు*

*ఎండలకు తగ్గిన దిగుబడులు*


6th sense TV:తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక అంతరాష్ట్ర పూల మార్కెట్ కు ఉగాది సందడి నెలకొంది. మంగళవారం జరిగే ఉగాది వేడుకలకు ఆదివారం నుంచి పూల అమ్మకాలు జోరందుకున్నాయి. ప్రస్తుత వేసవిలో ఎండలు మండిపోతున్నడంతో పూల దిగుబడులు గణనీయంగా తగ్గాయి. అందుకనే వీటి ధరలు మరింతగా పెరిగాయి. తెల్ల చామంతి కేజీ రూ. 450 దాటి పలకగా మిగిలిన చామంతులు రూ.350 నుంచి 400 పలికాయి. అలాగే బంతి రూ.80, లిల్లీ రూ.60, మల్లి రూ.700 నుంచి రూ.800, గులాబీ రూ.250 నుంచి 300, కనకాంబరాల బారు రూ.100 నుంచి రూ.150 కు కొనుగోలు చేశారు. ఆదివారం కొనుగోలు చేసిన పువ్వులు ఇతర జిల్లాలకు ఎగుమతులు జరిగాయి. సోమవారం కూడా ఉభయ గోదావరి జిల్లాలకు ఎగుమతులు ఉండటం వల్ల ఈ పూల ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. చామంతిలో కొత్త రకాలు రావడం వల్ల అవి మండే ఎండలను కూడా ఎదురెొడ్డి దిగుబడులు ఇస్తున్నాయి. ఇది పూల రైతులకు మంచి పరిణామం. ఈ రకం చామంతిని ఈ ఏడాది కొంతమంది రైతులు సాగు చేసి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.

6th Sense Tv

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

తూర్పు గోదావరి పాలిటిక్స్

వీరమహిళలు…

6th sense TV:కొత్తపేటలో పొత్తు ధర్మo.. పెటాకులౌతుందా.. ఆగ్రహించినవీరమహిళలు.. ఆనాడు దేశం అధిష్టానం ఆ బండారుకు సీటులేదు అలక పడవ గుర్తుతో ఇండిపెండెంట్ పోటీ..ఈనాడు దేశం..జనసేన అధిష్టానంల
కాకినాడ తూర్పు గోదావరి

ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ట్రాఫిక్ -1 సిఐ రమేష్

6th sense TV:కాకినాడ నగరం పరిసర ప్రాంతాల్లో పాఠశాల విద్యార్థులను ఆటోల్లో మితిమీరిన వేగంతో పాటు అధిక మందిని ఎక్కించుకుని వెళ్తున్న ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ కార్యక్రమం