జనసేన కార్యకర్తలకు భరోసా ఇస్తేనే పార్టీలో కొనసాగుతా….
6th sense TV:పెద్దాపురం:
భావోద్వేగానికి గురైన జనసేన ఇన్చార్జ్ తుమ్మల బాబు
పెద్దాపురం నియోజకవర్గం లోని జనసేన కార్యకర్తలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పెద్దాపురం నియోజకవర్గంలోని సీటు పొందిన తెలుగుదేశం అభ్యర్థి నిమ్మకాయల చిన్నరాజప్ప లు జన సైనికులు అందరికీ భరోసా ఇస్తేనే జనసేనలో కొనసాగుతానని జనసేన పార్టీ పెద్దాపురం ఇంచార్జ్ తుమ్మల రామస్వామి (బాబు) అన్నారు. పొత్తులలో భాగంగా పెద్దాపురం నియోజకవర్గం తెలుగుదేశానికి సీటు కేటాయించడంతో జనసేన నుంచి సీటు ఆశించిన తుమ్మల బాబు కన్నీటి పర్యంతమయ్యారు.చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పడినప్పుడు నుండి పార్టీని అంటిపెట్టుకొని పని చేయడం జరిగిందని,తదనంతరం పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఆవిర్భావం నుండి కూడా పెద్దాపురం నియోజకవర్గం ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుందని నమ్మకంతో పార్టీలో కొనసాగడం జరిగిందని అన్నారు.సొంత ఆస్తులు అమ్ముకుని పార్టీని నడపానే కానీ ఏ రోజు పార్టీ నిర్వహణ కోసం ఎవ్వరి దగ్గర చేయి చాపలేదని అన్నారు. నియోజకవర్గం లోని అనేక మండలాలలో జనసేన పార్టీని నమ్ముకుని కార్యకర్తలు పని చేశారని వారందరికీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పెద్దాపురం నియోజకవర్గానికి వచ్చి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉందని లేదంటే నా కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని తుమ్మల బాబు అన్నారు. ఇప్పటివరకు పార్టీలు నమ్ముకుని ఉన్న ప్రతి జన సైనికుడికి న్యాయం జరగాలని లేదంటే సైనికుల కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తానని అన్నారు.అంతకు ముందు నియోజకవర్గంలో తన చేసిన సేవలు ఖర్చుల వివరాలను కార్యకర్తలు అందరికీ ఆయన వివరించారు. కార్యకర్తల తో సమావేశం అంతరం తుమ్మల రామస్వామి (బాబు) కాసింత భావోద్వేగానికి గురయ్యారు