నాపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వండి: చంద్రబాబు…
6th sense TV:అమరావతి:2019 తర్వాత వివిధ జిల్లాల్లో తనపై పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలు ఇవ్వాలని DGPకి TDP చీఫ్ చంద్రబాబు లేఖ రాశారు.
‘ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి తమపై నమోదైన కేసుల వివరాలు నామినేషన్లో తెలియజేయాల్సి ఉంది.
గత ఐదేళ్లలో నాపై పలు అక్రమ కేసులు బనాయించారు.
వ్యక్తిగతంగా ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి నేను ఆ సమాచారం పొందడం ఆచరణ సాధ్యం కాదు’ అని డీజీపీ, అన్ని జిల్లాల ఎస్పీలు, ఏసీబీ, సీఐడీలకు లేఖలు పంపారు.