బడుగు బలహీన వర్గాల ఆత్మబంధువు కోనసీమఅభివృద్ధి స్వాప్నికుడు GMC బాలయోగి….
6th sense TV:కాకినాడ జిల్లా: తెలుగుదేశం పార్టీ
బడుగు బలహీన వర్గాల ఆత్మబంధువు కోనసీమ అభివృద్ధినే శ్వాసగా భావించిన స్వాప్నికుడు తొలి దళిత లోక్ సభ స్పీకర్ స్వర్గీయ గంటి మోహనచంద్ర బాలయోగి గారిని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు కొనియాడారు.
GMC బాలయోగి గారి వర్ధంతి సందర్భంగా జగన్నాధపురం యానం రోడ్డు బాలయోగి సెంటర్ నందు స్వర్గీయ జి.ఎం.సి. బాలయోగి గారి విగ్రహానికి వనమడి కొండబాబు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఒక సాధారణ దళిత రైతు కుటుంబంలో పుట్టి అంబేద్కర్ గారి ఆశయాలతో నడిచి ఒక న్యాయవాది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ కోనసీమ ప్రజల ఆత్మబంధువుగా పేరుపొంది దేశంలోనే అత్యున్నతమైన లోక్సభకు స్పీకర్ గా ఘనతను సాధించిన తెలుగు తేజం జి.ఎం.సి. బాలయోగి గారిని, బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన అందించిన సేవలు మరువలేవని ఆని, కోనసీమ అభివృద్ధికి నిరంతరం శ్రమించి, తెలుగుదేశం పార్టీకే కాకుండా రాజకీయాలకు కూడా వన్నితెచ్చిన మహనీయులు బాలయోగి గారిని, ఆయన అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ముందుకు సాగాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, సీకోటి అప్పలకొండ, అంబటి చిన్న, పలివెల రవి అనంత కుమార్, గొరుసు దుర్గారావు, పసగడుగుల శేషగిరిరావు, జాన్ వెస్లీ, తాజుద్దీన్, తుమ్మల రమేష్, ఆమెన్ జైన్, గదులు సాయిబాబా, గుత్తుల రమణ, కర్రి రాజారావు, దండుప్రోలు నాగబాబు, గోపిశెట్టి బూరయ్య, సంఘాని నాగూర్, సయ్యద్ అలీ, సంఘాని గాంధీ, అరదాడి శివ, దాసరి శ్రీను, రెడ్డనం సత్తిబాబు, బండి నరేంద్ర, పాలెపు రాజు, పెమ్మాడి నూకరాజు, కాలాడి ఏడుకొండలు, దేవానందం, తదితరులు పాల్గొన్నారు.