బొత్స కటౌట్‌కి పోటీగా గంటా కటౌట్..!
టీడీపీలో సీరియస్‌గా ‘ఆపరేషన్ చీపురుపల్లి’..
బొత్స కటౌట్‌కి పోటీగా గంటా కటౌట్..!
ఏపీలో కాంబినేషన్లు సెట్ చెయ్యడంలో బిజీగా ఉన్నాయి ప్రధాన పార్టీలు. పెద్దపెద్ద కటౌట్లే టార్గెట్‌గా స్కెచ్చులు గీస్తున్నాయి అధిష్టానాలు. లేటెస్ట్‌గా సెట్టవబోతున్న ఖతర్నాక్ కాంబినేషన్ బొత్స వర్సెస్ గంటా. ఒకరికొకరు ఎందులోనూ తీసిపోని వీళ్లిద్దరూ.. చీపురుపల్లిలో ముఖాముఖి తలపడితే ఎలా ఉంటుంది అని ఆల్రెడీ గెస్సింగ్స్ కూడా మొదలయ్యాయి. ఉత్తరాంధ్రను ఊపేసే మరో మల్టిస్టారర్ కమింగ్ సూన్ అన్నమాట.
వైసీపీలో నంబర్ 2, నంబర్ త్రీ, నంబర్ ఫోర్ ఎవరనే చర్చ వస్తే, మిగతావాళ్ల సంగతేమో గాని అక్కడ కచ్చితంగా వినిపించే పేరు బొత్స సత్యనారాయణ. బలమైన సామాజికవర్గ నేత, పైగా ఉత్తరాంధ్రలో పార్టీకి ఆయువుపట్టుగా పేరుందాయనకు. బొత్స కుటుంబం నుంచి ఏకంగా నలుగురు నేతలు పార్టీ నుంచి బరిలో ఉన్నారు. వైఎస్ విజయమ్మ పోటీ చేసిన విశాఖ ఎంపీ సీటునే బొత్స ఫ్యామిలీ ఖాతాలో వేసింది పార్టీ అధిష్టానం. ప్రస్తుతం బొత్స సతీమణి ఝాన్సీ విశాఖ ఎంపీ స్థానానికి ఇన్‌చార్జిగా ఉన్నారు. దటీజ్ ది పవర్ ఆఫ్ బొత్స.
వైసీపీ మూలాల్ని దెబ్బతియ్యాలన్న కమిట్‌మెంట్‌తో ఉన్న తెలుగుదేశం పార్టీ… ఇప్పుడు బొత్స మీదకి నేరుగా ఫోకస్ చేసింది. చీపురుపల్లిలో ఆయన్ను ఓడించడాన్ని ఛాలెంజ్‌గా తీసుకుంది. ప్రస్తుతానికి మాజీ మంత్రి, కళావెంకట్రావు మరదలు మృణాళిని తనయుడు నాగార్జున చీపురుపల్లి టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్నారు. కానీ.. బొత్స కటౌట్‌ను ఢీకొట్టాలంటే అతడు సరిపోదన్న నిర్ణయానికొచ్చింది టీడీపీ హైకమాండ్.
సేమ్ స్టామినా, సేమ్ ట్రాక్ రికార్డ్, సేమ్ సామాజికవర్గం టోటల్‌గా సేమ్ కటౌట్ సైజులున్న లీడర్ కోసం సెర్చ్ లైట్ వేసింది టీడీపీ. సరిగ్గా ఇక్కడే ఫ్లాష్ అయ్యారు గంటా శ్రీనివాసరావు. బొత్సతో పోలిస్తే గంటా బ్రాండుకు సైతం ఉత్తరాంధ్రలో గట్టి వ్యాల్యూనే ఉంది. తనకంటూ సొంత నెట్‌వర్క్‌ని ఏర్పాటు చేసుకుని, సొంత ఓటుబ్యాంకుని సమకూర్చుకున్న లీడర్‌గా గంటాకంటూ ఓ ప్రత్యేకత ఉంది. కాపు కులానికి చెందిన గంటాకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి, మంత్రిగా కూడా చేసిన అనుభవముంది. చోడవరం, అనకాపల్లి, భీమిలి, విశాఖ ఈస్ట్.. పోటీ చేసిన ప్రతీచోటా విక్టరీ కొట్టారు. ఇటీవల స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాజీనామా చేసి, వన్ అండ్ ఓన్లీ అనిపించుకున్నారు గంటా.
ప్రస్తుతం బొత్సను ఓడించేందుకు ‘ఆపరేషన్ చీపురుపల్లి’ చేపట్టింది టీడీపీ. చీపురుపల్లి తెలుదేశం పార్టీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావును నియమించాలన్న ప్రపోజల్‌ని సీరియస్‌గా ఆలోచిస్తోంది. గతంలో ప్రజారాజ్యంలో పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న గంటాకు మెగా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండనే ఉంది. ఇన్ని ఎలిమెంట్స్‌ని పరిశీలించాక… బొత్సకు చెక్ పెట్టాలంటే గంటాను మించిన మరో ఆప్షన్ లేదని డిసైడైంది టీడీపీ. గంటా శ్రీనివాసరావు, ఆయన వియ్యంకుడు, మాజీ మంత్రి నారాయణతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు వ్యూహకర్త రాబిన్‌శర్మ. ఇప్పటికే సర్వే రిపోర్టులన్నీ గంటాకు పాజిటివ్‌గానే ఉన్నప్పటికీ, మరోసారి స్థానికంగా సర్వే నిర్వహించి.. చీపురుపల్లిలో పార్టీ క్యాడర్‌తో మీటింగులు నిర్వహించి.. తుది నిర్ణయానికి రానుంది. సో.. బొత్స వర్సెస్ గంటా.. కేరాఫ్ చీపురుపల్లి. కటౌట్ల కొట్లాట షురూ అన్నమాట.