మహిళలు నోట ఒకటే మాట చెత్త మీద పన్ను మాకొద్దు….?
6th sense TV:కాకినాడ సిటి:
కాకినాడ సిటిలో జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ గారి నాయకత్వంలో డివిజన్ ఉపాధ్యక్షుడు కాండ్రేగుల సతీష్(రాజ్ బిళ్ళ) ఆధ్వర్యంలో స్థానిక 12 వ డివిజన్ పర్లొపేట రామాలయం చెత్త పన్ను నుండి విముక్తి కై యుద్ధానికి మేము సిద్ధమే అనే కార్యక్రమం జరిగింది.
ఈసందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఇక్కడ ఇంతమంది మహిళలు నోట ఒకటే మాట చెత్త మీద పన్ను మాకొద్దు చెత్త ప్రభుత్వం మాకొద్దు అని అంటూ సిద్ధం అని ఎందుకు అంటున్నారంటే దోపిడీ చేస్తున్న ద్వారంపూడిని దోపిడీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని దింపేందుకు సిద్ధం అని అంటున్నారన్నారు. వీళ్ళు కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయినీ కూడా ఈప్రభుత్వం దోచుకుంటోందనీ పేదలని కూడా చూడకుండా ప్రభుత్వం వీళ్ళ మీద అరవై రూపాయల నెలసరి చెత్తపన్ను వేస్తూ వ్యాపారం చేస్తోందనీ వ్యక్తపరచడానికి తీవ్ర భయాందోళన చెదుతున్నారన్నారు. ఇంక కేవలం సుమారు నలభై రోజులు మాత్రమే వీరికి సమయం ఉందనీ ఆతరువాత జనసేనపార్టీ తెలుగుదేశంల ఉమ్మడి ప్రభుత్వం రాబోతోందనె వస్తోందనీ మళ్ళీ మంచిరోజులు వస్తున్నాయనీ, ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు సిద్ధం అని స్థానికులతో కలిసి నినందిచారు.
ఈకార్యక్రమంలో సిటి జెనరల్ శెక్రటరీ సరగడ రమణా రెడ్డి, కుందు సతీష్, ఎస్.కె. జాఫర్, పొట్టి సతీష్, పొట్టి ఇంద్ర, చంతపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.