ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే ద్వారంపూడి…
ఓ ఎన్ జి సి పరిహారం, నిరసన ఉద్యమంపై చర్చ
6th sense TV:కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోమవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కాకినాడ సిటీ నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై సీఎంతో చర్చించారు. ముఖ్యంగా ఓ ఎన్ జి సి కార్యకలాపాల కారణంగా ఇబ్బందులు పడుతున్న మత్స్యకారుల సమస్యలను ఎమ్మెల్యే ద్వారంపూడి సీఎం దృష్టికి తీసుకువచ్చారు. నష్టపరిహారం కోసం మత్స్యకారులంతా శాంతియుత పోరాటం చేస్తున్న విధానాన్ని వివరించారు. ఓ ఎన్ జి సి, రిలయన్స్ వంటి సంస్థల వల్ల ఉపాధిని కోల్పోతున్న మత్స్యకారులకు నష్టపరిహారం ఇవ్వాల్సిన ఆవశ్యకతను, ఉద్యమాన్ని ఆయన సీఎంకు వివరించారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, మత్స్యకారులకు న్యాయం చేసేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే ద్వారంపూడి తెలిపారు.
