రోడ్డు ఆక్సిడెంట్ మరియు *ట్రాఫిక్ రూల్స్* పైన మరియు *సైబర్ నేరాలు* గురించి అవగాహన కార్యక్రమము…
6th sense TV: కాకినాడ జిల్లా: కాకినాడ సిటీ:
ఈరోజు (07.11.2024) వ తేదీన, ఉదయం గౌరవనీయులైన కాకినాడ జిల్లా ఎస్పీ *శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్.,* గారి ఉత్తర్వులు మేరకు మరియు కాకినాడ *SDPO శ్రీ రఘువీర్ విష్ణు* గారి సారథ్యంలో కాకినాడ ట్రాఫిక్ 1&2 CIs , యన్. రమేష్ & D.రామారావు గారు *విజయ గాయత్రి జూనియర్ కాలేజ్* నందు, విద్యార్థులకు, *రోడ్డు ఆక్సిడెంట్* మరియు *ట్రాఫిక్ రూల్స్* పైన మరియు *సైబర్ నేరాలు* గురించి అవగాహన కార్యక్రమము నిర్వహించినారు.
👉🏻 సైబర్ నేరలలో భాగముగా
*1) ఆన్లైన్ మోసాలు*,
*2) ఫేక్ లోన్స్ మోసాలు*,
*3) ఆన్లైన్ జాబ్స్/వర్క్స్*
*4) డిజిటల్ అరెస్ట్లు*
*5) పోక్సో చట్టం గురించి*
*6)112, 1930 కాల్స్* యొక్క ఉపయోగములు గురించి వివరించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
✍️ తదుపరి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహనలో భాగంగా
1) మోటార్ సైకిల్స్ నడిపే ప్రతి ఒక్కరు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని,
2) ట్రిపుల్ రైడింగ్, బైక్ స్టంట్స్, మైనర్ డ్రైవింగ్ చేయరాదని.
3) వాహనములను అతి వేగముగా నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వలన కలుగు ప్రమాదాలు గురించి వారికి వివరించడం జరిగినది.
4) ద్విచక్ర వాహనం నడుపు ప్రతి ఒక్క విద్యార్థి, స్టాఫ్ మరియు వారి కుటంబ సభ్యులు అందరు విధిగా హెల్మెట్ ధరించి వాహనము నడపాలని *పవర్ పాయింట్ ప్రెజంటేషన్* ద్వారా ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించటమైనది.
ఇట్లు
*CIs ట్రాఫిక్ 1&2 పీస్* కాకినాడ.