అక్రమ నిల్వలు, అక్రమ రవాణా పై నిరంతరం నిఘా….
6th sense TV:రాజమహేంద్రవరం:
రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి వారి కార్యాలయము, రాజమహేంద్రవరం ఈ రోజు అనగా *ది.08.03.2024వ* తేదీన కాకినాడ జిల్లాలోని గండేపల్లి మండలంలోని నీలాద్రిరావు పేట గ్రామంలోని వీరం పేరంటాలమ్మ దేవాలయం సమీపములో పి.డి.ఎస్(రేషన్ బియ్యం)తో వెళ్ళుతున్న వాహనము చిన్న ప్రమాదానికి గురైందని సమాచారంతో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో సదరు భారత్ బెంజ్ వాహనం నెం. AP 39 UJ 2579 వాహనంను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా, సదరు వాహనం నందు 252 బస్తాలలో సుమారు 12,435 కేజీల పి.డి.ఎస్ బియ్యంను గుర్తించటమైనది అందులో 117 బస్తాలు తెల్లటి ప్లాస్టిక్ సంచుల్లో ఉన్నాయి మరియు మిగిలిన 135 గోనె సంచులు AP రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా సరఫరా చేయబడ్డాయి. సదరు పి.డి.ఎస్ బియ్యంను వాహన డ్రైవర్ శ్రీ వల్లబశెట్టి సాయి రాజేష్, S/o సుబ్బారావు వారు సువేరా ఆగ్రో ఇండస్ట్రీస్ (యజమాని శ్రీ పసుపులేటి శ్రీను), కనుమోలు గ్రామం, కృష్ణా జిల్లా నుండి కాకినాడ జిల్లాకు చెందిన శ్రీ వెలుగుల వాసుకు రవాణా చేయబడుతుంది. సదరు పి.డి.ఎస్ బియ్యంను అక్రమముగా తరలించుట కారణముగా సుమారు రూ. 30,65,792.50 లు విలువ గల 12,435 కేజీల రేషన్ బియ్యంను మరియు పైన తెలిపిన వాహనంను సివిల్ సప్లయ్స్ అధికారులు, గండేపల్లి వారు సీజ్ చేసి 6-ఏ క్రింద కేసు నమోదు చేసి వాహన డ్రైవర్, యజమాని, పి.డి.ఎస్ బియ్యం కొనుగోలుదారు సంబందిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు కొరకు పోలీసు స్టేషన్ కు సిఫారసు చేయటమైనది. ఈ సందర్భముగా రీజనల్ విజిలెన్స్ ఎస్.పి. శ్రీ కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డి, ఐ.పి.ఎస్ గారు మాట్లాడుతూ రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోని మూడు జిల్లాలలో పి.డి.ఎస్(చౌక బియ్యం) అక్రమ నిల్వలు, అక్రమ రవాణా పై నిరంతరం నిఘా కొనసాగుతుంది అని, ఎవ్వరైనా పి.డి.ఎస్(చౌక బియ్యం) కొనడం, అమ్మడం చేస్తే సదరు వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని తెలిపియున్నారు. ఈ తనిఖిలలో విజిలెన్స్ అధికారులు నాగ వెంకట రాజ, సి.ఎస్.డి.టి కృష్ణ, కానిస్టేబుల్స్ వలీ, కిషోర్ పాల్గొన్నారు .