అక్రమ మద్యం పట్టివేత:ఎస్సై బి.నరసింహా రావు…
అక్రమ మద్యం పట్టివేత:ఎస్సై బి.నరసింహా రావు
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం ఎస్సై బి.నరసింహా రావు అక్రమ మద్యం పై ఉక్కుపాదం మోపారు…జే.బి.కే పురం లో అక్రమ మద్యం అమ్ముతునట్లు తనకు అందిన సమాచారం మేరకు ఎస్సై బి.నరసింహా రావు ఆదివారం ఉదయం తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు.ఇందులో భాగంగా అక్రమ మద్యం విక్రయిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.అలానే నిందితుని వద్ద నుండి 32 (180 ఎం.ఎల్) మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు….
అయితే ఎస్సై బి.నరసింహా రావు బేస్తవారిపేట మండలం లో పదవి భాధ్యతలు చేపట్టి కొద్దికాలం అయినప్పటికీ అనేక మార్లు అక్రమ మద్యం పై ఉక్కుపాదం మోపుతూ ఈ అరాచక శక్తిని ఎప్పటికీ అప్పుడు అనదదొక్కటం పై మండల ప్రజలు హర్షం వ్యక్తపరుస్తున్నారు….