అచ్యుతాపురం సెజ్ ప్రమాద. బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు…..
6th sense TVవిశాఖపట్నం:
*ఉత్తమ వైద్య సేవలందిస్తాం. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తాం.*
విశాఖపట్నం చేరుకున్న ఆయన.. నేరుగా మెడికవర్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులతోనూ మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని.. మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భయపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం బాధితుల కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత ఆస్పత్రి వెలుపల సీఎం మీడియాతో మాట్లాడారు.
ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా.. 36 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 10 మంది తీవ్రంగా, 26 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఎంత ఖర్చు అయినా బాధితులందరికీ ఉత్తమ వైద్య సేవలందిస్తాం. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తాం. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందజేస్తాం. తీవ్ర గాయాలపాలైన వారికి రూ.50లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయి. దాని పర్యవసానమే ఈ ప్రమాదం” అని సీఎం అన్నారు.