అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజన్…?
6th sense TV:విశాఖపట్నం:వైఎస్ షర్మిలా రెడ్డి
పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది?
పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్.
ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండటం మీ రోడ్ మ్యాప్.
ఆంధ్రుల తలమానికం వైజాగ్ స్టీల్ ను కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజన్.
రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం మీకు ప్రాక్టికల్.
గుట్టల్ని కొట్టడం,పోర్టులను అమ్మడం,
భూములను మింగడం.. ఇదే విశాఖపై వైసీపీ విజన్.
ఇప్పుడు ఎన్నికల ముందు 10 ఏళ్ల వ్యూహాల పేరుతో ..కొత్త నాటకాలు కాదా ?