*అర్థరాత్రి పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు*
6th sense TV:విజయవాడ:
సుమారు మూడు లక్షల కుటుంబాలు ఆదివారం రాత్రి నిద్రలేకుండా గడిపాయి. అధికారులు కూడా నిద్రలేకుండా గడపడం విశేషం.
అర్ధరాత్రి పర్యటించిన ముఖ్యమంత్రిముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అర్ధరాత్రి 12 గంటల తరువాత కూడా నగర శివారులోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించి ఆశ్చర్యానికి గురిచేశారు. ఆయన వయసుకు మించిన పనిచేశారని పలువురు అభినందిస్తున్నారు. పైగా వరద నీటిలో పడవల్లో ప్రయాణించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అజిత్ సింగ్ నగర్ వరద ముంపు ప్రాంతాల్లో బాధితుల్లో ఆత్మ స్థైర్యం నింపి వారికి అందిస్తుంన్న సహాయక చర్యలు పరిశీలించేందుకు అర్ధరాత్రి ముఖ్యమంత్రి పర్యటించారు. స్వయంగా బాధితులతో మాట్లాడారు. అక్కడ నుంచి బయలుదేరి విజయవాడ కలెక్టరేట్‌కు చేరుకున్నారు.