కాకినాడ

అవసరమైతే గ్యాస్ గొట్టాలను బ్లాక్ చేద్దాం…

6th sense TV: కాకినాడ:కేజీ బేసిన్ లో చమురు గ్యాస్ ఏపీ వాట దక్కేవరకు ద శ లు వారి పోరాటం

ప్రమాదాలు మాకా ? లాభాలు మీకా.

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్

రాజకీయ పార్టీలతీతంగా పతాక స్థాయికి ఉద్యమం
ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలి.
కేజీ బేసిన్ అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టాలి.
అఖిలపక్ష ప్రజాసంఘాల మేధావులు పిలుపు…

కాకినాడ, ఫిబ్రవరి,29: కృష్ణా గోదావరి బేసిన్ లో ఇటీవల కాకినాడ తీరం లో చమురు గ్యాస్ 12వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు 50 శాతం వాటా ఏపీకు దక్కాలని, కాకినాడకు10% శాతం ఇవ్వాలని కోరుతూ ద శ లు వారి పోరాటం నిర్వహిస్తామని, అఖిలపక్ష ప్రజాసంఘాల మేధావులు ముక్తకంఠంతో పిలుపునిచ్చారు.
బుధవారం ఉదయం స్థానిక గాంధీభవన్లో కేజీ బేసిన్ గ్యాస్ చమురు వాటా ఏపీకు దక్కాలని కోరుతూ సిపిఐ- కాకినాడ జిల్లా అభివృద్ధి పొరట కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. దీనికి కాకినాడ జిల్లా అభివృద్ధి పోరాట కమిటీ చైర్మన్ తాటిపాక మధు అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో
కాంగ్రెస్, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, పౌర సంక్షేమ సంఘం, మేధావుల సంఘం, వివిధ ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.

ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్ మాట్లాడుతూ నాలుగు జిల్లాల్లో గ్యాస్ సమురు వ్యాపించి ఉన్నదని, ఇది ఉపరితలపరంగా చూస్తే 28 వేల సదరపు కిలోమీటర్లను సముద్ర గర్భంలో 24 కిలోమీటర్ల పరిధిలో ఉందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం సంస్థ అయిన ఓఎన్జిసి 1956 ఆగస్టు 14న సమరూ గ్యాస్ నిక్షేపాల కోసం పరిశోధనలు ప్రారంభించింది అన్నారు. 1978 లో నరసాపురం వద్ద మొదట బా వి ని తవ్వి గ్యాస్ ను కనుగొన్నారని ఆయన తెలిపారు. ఇప్పటికే వివిధ దేశాల్లో ఆయిల్ కోసమే అనేక యుద్ధాలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. సహజ వనరులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుందని డేగ అన్నారు. ఆనాడు గ్యాస్ వాటా కోసం వైయస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేశారని, పలు ఉత్తరాలు ఢిల్లీకి రాశారని, చివరికి ఆయన మరణం కూడా దీని వల్లే జరిగిందని, అనేక ప్రచారాలు వచ్చాయన్నారు. కానీ నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేజీ బేసిన్ గ్యాస్ పై నోరు మెదపడం లేదని, 25 స్థానాలు పార్లమెంట్ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా విభజన హామీలు సాధిస్తానన్న జగన్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోలేకపోయారని ఆయన అన్నారు. దీనిపై సిపిఐ రాష్ట్ర కమిటీ భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తుందని డేగ తెలిపారు.

ప్రముఖ న్యాయవాది బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జవహర్ హలీ మాట్లాడుతూ నిమిషానికి కోట్లు విలువైన గ్యాస్ సంపద మన రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు తరలించకపోవడం చాలా దురదృష్టమన్నారు. ఆనాడు సమైక్యాంధ్ర ఉద్యమంలోనే నేను కేజీ బేసిన్ పై ఉద్యమం చేయాలని చెప్పానని ఆయన గుర్తు చేశారు. ఇతర రాష్ట్రానికి వె ల్లే గొట్టాల గుండా గ్యాస్ను బ్లాక్ చేస్తే కేంద్రం దిగి వస్తుందని, అలాంటి ఉద్యమాలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధపడాలని ఆయన పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ పిసిసి ఉపాధ్యక్షులు మట్ట శివప్రసాద్ మాట్లాడుతూ కేజీ బేసిన్ ప్రాంతాల్లో రైతులకు కూడా తీవ్ర నష్టం జరుగుతుందని, నష్టపరిహారాలు సరైన సమయంలో ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్ర బాగు కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, దానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని ఆయన పిలుపునిచ్చారు.

ఆమ్ ఆద్మీ పార్టీ కే .కృష్ణమోహన్ మాట్లాడుతూ కేజీ బేసిన్ సమరూ గ్యాస్ మన వాటా ఇస్తే ఏపీ ప్రాంతం మంచి అభివృద్ధి జరుగుతుందని, దిశ దశ మారతాయని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వల్లే కేజీ బేసిన్ గ్యాస్ వేరే రాష్ట్రాలకు తరలిపోతుందని ఆయన తెలిపారు. ప్రమాదాలు కన్నీళ్లు కష్టాలు మనకని, లాభాలు ప్రయోజనాలు వేరే రాష్ట్రాల అనుభవిస్తున్నారని అన్నారు.

సిపిఎం జిల్లా నాయకులు దువ్వశేసు బాబ్జీ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో డిమాండ్ ను పెట్టాలని, ఈ డిమాండ్ ను ఇంటింటికి తీసుకెళ్లాలని ఆయన కోరారు. అప్పటికి ప్రభుత్వం తేల్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నారు.

పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దుసర్ల పూడి రమణ రాజు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేసే పార్టీ కమ్యూనిస్టులని, కేజీ బేసిన్ పై కూడా మీరు ఉద్యమిస్తే ఏపీకు కాకినాడకు ప్రయోజనం ఉంటుందన్నారు. మన వాటా కాకినాడకు 10 శాతం రాష్ట్రానికి 40 శాతం ఇవ్వాలని పోరాటం ద్వారా తెచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల వెంకటరమణ తాళ్లూరి రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో స్వార్ధపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని, ఇటువంటి తరుణంలో వామపక్షాలు వేదికగా ఉండి పోరాటం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి పూర్తి మద్దతు ఉంటుందన్నారు.

కాకినాడ జిల్లా అభివృద్ధి పోరాట కమిటీ చైర్మన్ తాటిపాక మధు, కార్యదర్శి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు ముందుగా వినతి పత్రాలు అందజేద్దామని, ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నాయకత్వంలో సదస్సు పెద్ద ఎత్తున ఏర్పాటు చేద్దామని, అక్కడి నుండి దసల వారి ఉద్యమాలు చేద్దామని, వచ్చే ఎన్నికల్లో దీనిపై అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలని వారు కోరారు.

టి ఎన్ టి యు సి నాయకులు గదులు సాయిబాబా మాట్లాడుతూ కేజీ బీసీలు గ్యాస్ నిక్షేపాలపై మన వాటా కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి మన కాకినాడ జిల్లా ప్రజల కోరికను ఆయనకు వినిపిస్తామని ఆయన తెలిపారు.

సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానాలను భవిష్యత్తు కర్తవ్యాలను ప్రవేశపెట్టగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. భవిష్యత్తులో జరిగే ఉద్యమాన్ని విద్యార్థి, యువజన, కార్మిక, రైతు అన్ని వర్గాల వారు జయప్రదం చేయాలని వారు కోరారు.

ఇంకా ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు
పి. సత్యనారాయణ, పి ఎస్ నారాయణ, బీసీ సంఘం జిల్లా ప్రెసిడెంట్ చెక్క నూకరాజు, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇళ్ల దాసగిరి రావు, సైకాలజిస్ట్ జి. సత్యమూర్తి త్రిమూర్తులు, రంగారావు, ఎమ్మెస్ నారాయణ, పప్పు ఆదినారాయణ, బొబ్బిలి శ్రీనివాసరావు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

6th Sense Tv

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

ఆంధ్రప్రదేశ్ కాకినాడ పాలిటిక్స్

కాకినాడ సిటీ నియోజవర్గం నుండి మహానాడు కు పెద్ద ఎత్తున తరలి వెళ్లిన వనమాడి కొండబాబు పసుపు సైన్యం

6త్ సెన్స్ టీవీ కాకినాడ రిపోర్టర్; బస్సులు, కార్ల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కాకినాడ సిటీ నియోజకవర్గం ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు కళాకారునిగా
ఎకానమీ కాకినాడ

గ్రామీణ ఉపాధి హామీ 200 రోజులు పని దినాలు 600రూపాయలు వేతనం పెంచాలని……

6th sense tv,కాకినాడ రూరల్ ఫిబ్రవరి 24 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టండిరాజకీయ పార్టీలకు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ కాకినాడ జిల్లాలో