ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా..*మద్యం మాంసం అమ్మకాలు మాంసాహార విక్రయాలు నిషేధించాలి…పౌరసంక్షేమసంఘం…
6th sense TV:కాకినాడ జిల్లా:
🔸కాకినాడ సిటీ /రూరల్ : 14.8.2024🇮🇳
ఆగస్ట్15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున భారత రాజ్యాంగం ప్రకారం మద్యంమాంసం అమ్మకాలు పూర్తిగా నిషేధించాలని.. మద్యం అమ్మకాలు కొనసాగించి న మద్యం దుకాణాలు తెరిచినా మాంసం అమ్మకాలు హోటల్స్ లో మాంసాహార విక్రయాలు జరిపినా నిబంధనల ప్రకారం కేసులు నమో దు చేసి నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకుంటా రని వీటిని అమలు చేయాల్సిన బాధ్యత ఎక్సైజ్ మున్సిపల్ కార్పోరేషన్ శానిటరీ ఇన్ స్పెక్టర్స్ పై వుంటుం దని పౌర సంక్షేమ సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. కాకినాడ నగరం రూరల్ ప్రాంతా ల్లో ఆగస్ట్ 15న మాంసాహార హోటల్స్ ప్రారంభం ప్రత్యేక మద్యం విందు ఏర్పాట్లు పలు మాంసాహారాల వెరైటీలతో స్పెషల్ అమ్మకాల ఏర్పాట్లు జాతర తరహాలో ముమ్మరంగా ఉన్నాయ న్నారు. జిల్లా యంత్రాం గం కఠినంగా అరికట్టా ల్సిన బాధ్యత వుందని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు.