ఆపదలో ఉన్నవారు.. సహాయం కోరేవారు.. మాత్రమే పోలీస్ స్టేషన్కు వస్తారు..
తిరుపతి జిల్లా…ఎస్పీ మలిక గర్గ్,
చంద్రగిరి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మలిక గర్గ్,
ఆపదలో ఉన్నవారు.. సహాయం కోరేవారు.. మాత్రమే పోలీస్ స్టేషన్కు వస్తారు.. వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనదే.
విజిబుల్ పోలీసింగ్ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ విధులను పెంచాలి.
చంద్రగిరి నియోజకవర్గం చాలా సున్నితమైన ప్రాంతం.. సార్వత్రిక ఎన్నికలు-2024 దృష్ట్యా పాత నేరస్తులు బైండోవర్.
భాకరాపేట ఘాట్ రోడ్డు లో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ అమలు.
చిత్తూరు-తిరుపతి హైవే రహదారి వెంబడి డాబాలు, హోటళ్ల వద్ద వాహనాలు హైవే రహదారిపై నిలపకుండా ఉండేందుకు కఠిన చర్యలు.
క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ, ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడి సమస్యలకు పరిష్కార మార్గం.
గ్రామాల యందు వీపీఓ (విలేజ్ పోలీస్ ఆఫీసర్) ల ద్వారా గ్రూపు తగాదాలు ఏర్పడకుండా తక్షణ పరిష్కారం.
జిల్లా ఎస్పీ మలిక గర్గ్,
తిరుపతి జిల్లా ఎస్పీ గా బాధ్యతలు తీసుకున్న శ్రీమతి మలిక గర్గ్ ఐపీఎస్., గారు సమర్థవంతంగా సార్వత్రిక ఎన్నికలు-2024 నిర్వహణ ధ్యేయంగా నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలిస్తూ తన కార్యాచరణను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ తిరుపతి జిల్లా, చంద్రగిరి సబ్ డివిజన్, చంద్రగిరి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలు, వివిధ గదులను పరిశీలించారు. అనంతరం ఎస్.హెచ్.ఓ. స్టేషన్ సిబ్బంది యొక్క పనితీరును సమీక్షించి జనరల్ డైరీ, కేసు డైరీ, కోర్టు క్యాలెండర్ వంటి పలు రికార్డులను తనిఖీ చేసి పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నందు పెండింగ్లో ఉన్న కేసులను సకాలంలో దర్యాప్తు చేయుటకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి బాధితులకు సరైన న్యాయం చేయాలనీ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మహిళా సంబంధిత నేరాల పట్ల వెంటనే స్పందించి న్యాయం చేయాలన్నారు.