ఆంధ్రప్రదేశ్ కడప

ఈసారి వివేకాను చంపిందెవరో చెప్పి జగన్‌ ఓట్లుఅడగాలి: దస్తగిరివ్యాఖ్యలు….

కడప జైలు నుంచి బెయిల్ పై విడుదలైన దస్తగిరి

వ్యాఖ్యలు

చావడానికైనా సిద్ధమే గానీ.. సీఎం జగన్‌, ఎంపీ అవినాష్‌రెడ్డిల బెదిరింపులకు తలొగ్గేది లేదని మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి స్పష్టం చేశారు. పులివెందులలో ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటి పక్కనే తాను నివాసం ఉంటానని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. వివేకా హత్యకు సంబంధించి తప్పుచేసి ప్రాయశ్చిత్తంతో అప్రూవర్‌గా మారానని, ఇప్పుడు సీఎం, ఎంపీల మాటలు విని మళ్లీ తప్పు చేసి పాపం మూటకట్టుకోదలచుకోలేదని పేర్కొన్నారు.

ఎట్రాసిటీ, దాడి కేసుల్లో నాలుగు నెలలుగా కడప జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న దస్తగిరి బెయిల్‌పై శుక్రవారం విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో వివేకా హత్యను అడ్డం పెట్టుకుని జగన్‌ సానుభూతితో గెలుపొందారని, ఇప్పుడు అదే కుట్రతో మళ్లీ గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వివేకా కేసులో అప్రూవర్‌గా ఉన్నాననే ఉద్దేశంతోనే కుట్ర పన్ని, కేసుల్లో ఇరికించి వైకాపా పెద్దలు తనను జైలుకు పంపారని చెప్పారు. కడప జైల్లో ఉన్న సమయంలో వివేకా కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి తనను కలిశారని, డబ్బు ఆశ చూపి రాజీకి రావాలని అభ్యర్థించారని దస్తగిరి తెలిపారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని ప్రలోభ పెట్టారని, వెనక్కితగ్గే ప్రసక్తే లేదని తాను తేల్చిచెప్పినట్లు వెల్లడించారు. ఈసారి వివేకాను ఎవరు హత్య చేశారో చెప్పి ఓట్లు అడగాలని జగన్‌, అవినాష్‌రెడ్డిలను డిమాండ్‌ చేశారు. వారిద్దరూ పులివెందులలో ఓట్లు అడిగే పక్షంలో ప్రజలు రాళ్లు వేస్తారని హెచ్చరించారు. సిద్ధం సభల్లో వివేకాను హత్య చేసిందెవరో జగన్‌ చెబితే బాగుంటుందని వ్యాఖ్యానించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత దస్తగిరి పోలీసు బందోబస్తు మధ్య పులివెందుల వెళ్లారు. నాలుగు నెలల పాటు జైలు జీవితం అనుభవించిన దస్తగిరి.. ఏమాత్రం తగ్గకుండా సీఎం, వైకాపా నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

6th Sense Tv

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

ఆంధ్రప్రదేశ్

Kiran Kumar Reddy: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి.. అందుకే కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చిందంటూ..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కొద్దిరోజుల క్రితమే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి జేపీ
ఆంధ్రప్రదేశ్ కాకినాడ పాలిటిక్స్

కాకినాడ సిటీ నియోజవర్గం నుండి మహానాడు కు పెద్ద ఎత్తున తరలి వెళ్లిన వనమాడి కొండబాబు పసుపు సైన్యం

6త్ సెన్స్ టీవీ కాకినాడ రిపోర్టర్; బస్సులు, కార్ల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కాకినాడ సిటీ నియోజకవర్గం ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు కళాకారునిగా