ఈ అవార్డు ఎంతో బాధ్యతనిచ్చింది డాక్టర్ వీర్రాజు…
6th sense TV:కాకినాడ జిల్లా: కాకినాడ సిటీ:
కాకినాడ, నవంబర్ 30: రాష్ట్రస్థాయిలో 2023-24 సంవత్సరానికి టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ సంస్థ మొత్తం వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్, వైద్యుల వారి ప్రతిభ గుర్తించి అందించే టైమ్స్ హెల్త్ ఎక్స్లెంట్ అవార్డ్ అందుకోవడం తనకు ఎంతగానో బాధ్యతలను పెంచిందని డాక్టర్ బిహెచ్ పిఎస్ వీర్రాజు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా వీర్రాజు అందుకున్నారు.
ఈ సందర్భంగా శనివారం నాగమల్లి తోట సెంటర్లో ఉన్న టీం హాస్పిటల్లో ఆయన విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ అవార్డ్ అందుకోవడం కన్నా తమ ఆసుపత్రుల్లో వైద్యం అందుకుని ఆరోగ్యవంతులుగా వారి వారి ఇళ్లకు వెళ్ళడం తనకు ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నారు. ఈ అవార్డ్ సూర్య గ్లోబల్ ఆసుపత్రి, టీం ఆసుపత్రిలలో తాను పడిన కష్టానికి ఈ అవార్డు దక్కిందన్నారు. ఈ అవార్డు అందుకున్న బాధ్యతతో నిరంతరం ప్రజలకు దగ్గరగా ఉండి సేవలందించస్తానని డాక్టర్ వీర్రాజు తెలిపారు.