ఉప్పాడ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్, IPS…..
6th sense TV:కాకినాడ జిల్లా,
ది. 26.07.2024.
ఉప్పాడ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ను
ఆకస్మిక తనిఖీ చేసిన
కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్, IPS.
ఈరోజు సాయంత్రం కాకినాడ జిల్లా లోని ఉప్పాడ కొత్తపల్లి
పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసి, పోలీస్ స్టేషన్ పరిసరాలను, భవనమును పరిశీలించినారు.
పోలీస్ స్టేషన్ కు సంబందించిన వివిధ రికార్డులను పరిశీలించి ఉప్పాడ కొత్తపల్లి SI కు పలు సూచనలు చేసిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్, IPS.
పోలీస్ స్టేషన్ ను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి విషయమును రికార్డుల యందు జాగ్రత్తగా నమోదు పరచాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే వారిని మర్యాద పూర్వకముగా చూసి, వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
పోలీస్ స్టేషన్ ను ఎస్పీ గారు సందర్శించిన సమయంలో ఎస్సై స్వామినాయుడు మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది హాజరుగా ఉన్నారు.