ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో
6th sense TV: ఆంధ్రప్రదేశ్:*ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న సందర్భంలో…లైసెన్సుడ్ గన్స్ ఇచ్చేయండి: పోలీసు శాఖ*
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో లైసెన్సుడ్ ఆయుధాలు కలిగి ఉన్నవారందరూ వాటిని వారి సమీప పోలీసు స్టేషన్ లో అందజేయాలని రాష్ట్ర పోలీసు శాఖ తాజాగా సూచించింది.
ఎన్నికలయ్యే వరకు కొత్త ఆయుధాల జారీని కూడా నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది.
తమ వద్ద సమాచారం ఉన్న లైసెన్సుదారులందరికీ పోలీసులు ఈ సమాచారాన్ని పంపుతున్నారు.
రాష్ట్రంలో సుమారు 10 వేలమంది వరకు గన్ లైసెన్సు కలిగి ఉన్నట్లు సమాచారం.