ఎయిర్‌పోర్టులో ఢీ కొన్న రెండు విమానాలు
6th sense TV:లండన్ :
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్ర యాల్లో ఒకటైన లండన్ లోని హీత్రూ ఎయిర్‌పోర్టు లో ప్రమాదం చోటుచేసు కుంది.
రెండు విమానాలు ఒక దానికొకటి ఢీ కొన్నాయి. వర్జిన్ అట్లాంటిక్‌కు చెందిన బోయింగ్ 787-9 రకం విమానం ప్రయాణం ముగించుకుని మరో ప్రదేశానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.
అది టెర్మినల్ వద్ద బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన ఎయిక్రాఫ్ట్‌ను తాకడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు విమా నాలు స్వల్పంగా దెబ్బతి న్నాయి.
ఇరు సంస్థలు ఈ విషయా న్ని ఓ ప్రకటనలో ధ్రువీకరిం చాయి. తమ ఎయిర్‌క్రాఫ్ట్ ఎంత మేరకు దెబ్బతిన్నదో ఇంజినీర్లు అంచనా వేస్తు న్నారని బ్రిటీష్ ఎయిర్వేస్ పేర్కొంది.
ప్రయాణికులకు ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు చేస్తు న్నామని తెలిపింది. మరోవైపు ఈ ప్రమాదం జరిగిన వెంటనే బృందం అప్రమత్తమైంది.
ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్లు కూడా చేరుకు న్నాయి. ఇంజినీరింగ్ బృందాలు విమానాలను పర్యవేక్షిస్తున్నాయని, ప్రస్తుతం వాటిని సర్వీసు తాత్కాలికంగా నిలిపి వేసినట్లు బ్రిటిష్ ఎయిర్వేస్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ప్రభావం కస్టమర్ల మీద పడకుండా ఉండటానికి ప్రత్యామ్నాయ విమానం అందించినట్లు పేర్కొంది…