కన్న కొడుకే కాల యముడు…
6th sense TV:ఈ అమానుష ఘటన జరిగింది అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోనే..
ఆస్తి పంపకాల విషయంలో తల్లి దండ్రులపై తనయుడు ఘాతుకానికి వడి గట్టాడు. అమానుషంగా శనివారం సాయంత్రం దాడి చేసిన ఘటన ఆదివారం మదనపల్లిలో వెలుగు చూసింది. మదనపల్లి రెండవ పట్టణ పోలీసుల కథనం మేరకు వివరాలు… పట్టణంలోని నీరు గట్టువారిపల్లె, అయోధ్యనగర్లో కాపురం ఉంటున్న దంపతులు వెంకటరమణారెడ్డి, లక్ష్మమ్మల కుమారుడు శ్రీనివాసులురెడ్డికి భూ వివాదం ఉంది. దీంతో శనివారం సాయంత్రం తల్లి దండ్రులు దన్నం పెడుతున్నా వదల కుండా కసాయి కొడుకు శ్రీనివాసులు రెడ్డి కొట్టే దెబ్బలకు ఆ వృద్ధ దంపతులు తల్లఢిల్లడం చూపరుల హృదయాలను తీవ్రంగా కలవేసింది