కాకినాడ జిల్లా కలెక్టర్గా నివాస్ …
6th sense TV:కాకినాడ:
కాకినాడ జిల్లా కలెక్టర్గా జే నివాస్ నియమితులయ్యారు. నివాస్ ప్రస్తుతం వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు కాకినాడ జిల్లాకు కలెక్టర్గా కృతిక శుక్ల బాధ్యతలు నిర్వహించారు. గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి జే నివాస్ను కలెక్టర్గా నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2022 ఉగాదికి జిల్లాల విభజనలో నూతనంగా ఏర్పడిన కాకినాడ జిల్లాకు కృతికా శక్ల కలెక్టర్గా నియమితులై దాదాపు రెండేళ్ల పాటు పనిచేశారు.