కాకినాడ జిల్లా స్వీప్ అంబాసిడగా యశస్వి..
6th sense TV:కాకినాడ :ఓటు హక్కు వినియోగంపై యువతలో చైతన్యాన్ని తీసుకువచ్చే లక్ష్యంతో ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు, జీ సరిగమప కార్యక్రమ విజేత డా.యశస్వి కొండేపూడిని కాకినాడ జిల్లా స్వీప్ (సిస్టమెటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టీసీపేషన్ ప్రోగ్రాం) అంబాసిడర్ గా నియమించినట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఈ మేరకు డా.యశస్వి కొండేపూడి శనివారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ జె.నివాస్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్.. యశస్విని సత్కరించారు. లోక్ సభ, శాసనసభ సాధారణ ఎన్నికలు 2024 కు సంబంధించి ఓటర్లలో చైతన్యం, అవగాహన కల్పించే లక్ష్యంతో జిల్లాలో స్వీప్ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో యువత ఓటు హక్కు వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో కాకినాడ పట్టణానికి చెందిన ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు డా.యశస్వి కొండేపూడిని కాకినాడ జిల్లా స్వీప్ అంబాసిడర్ గా నియమించినట్లు కలెక్టర్ జె.నివాస్ వెల్లడించారు.