కాకినాడ సిటీ నియోజవర్గం నుండి మహానాడు కు పెద్ద ఎత్తున తరలి వెళ్లిన వనమాడి కొండబాబు పసుపు సైన్యం
6త్ సెన్స్ టీవీ కాకినాడ రిపోర్టర్; బస్సులు, కార్ల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కాకినాడ సిటీ నియోజకవర్గం ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు
కళాకారునిగా రాణిస్తూ సినీ రంగంలోకి ప్రవేశించి మకుటం లేని మహారాజుగా వెలుగొంది, దేశ రాజకీయాల్లో పెనుమార్పులు సృష్టించి సరికొత్త రాజకీయానికి నాంది పలికి, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన మహనీయులు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి మరియు మహానాడు – 2023 సందర్బంగా రాజమాండ్రి నందు ప్రతిష్ట్యాష్టంగా నిర్వహిస్తున్న శత జయంతి ఉత్సవాల బహిరంగ సభకు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో కాకినాడ సిటీ నుండి 45 బస్సులు 100 కార్లు, బైక్ లపై పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరిలివెళ్లారు.
జగన్నాధపురం వనమాడి కొండబాబు స్వగ్రహం నందు కొండబాబు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగు వారి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు మహానాడు కార్యక్రమం వేమగిరి రాజమండ్రి నందు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందిన, వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టిoచినా, RTC బస్సులు, ప్రైవేట్ స్కూల్ బస్సులు ఇవ్వనివ్వకుండా అడ్డంకులు సృష్టిoచినా తెలుగుదేశం పార్టీ కుటంబసభ్యులు, నందమూరి అభిమానులు, రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడo జరుగుతుందిని, ఇది వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమని, రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అరాచక పాలన నుండి రాష్ట్రానికి కాపాడి తెలుగుదేశం పార్టీ పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ది బాటలో తీసుకువెళ్ళడానికి, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగు దేశం పార్టీని గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలిపారు.]
ఈ కార్యక్రమంలో మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, గ్రంధి బాబ్జి, అంబటి చిన్నా, SK రహీమ్, మల్లాడి గంగాదరం, మల్లాడి చిన్నా, ఏరిపిల్లి రాము, నల్లూరి శ్రీనివాస్, చోడిపిల్లి సతీష్, మూగు రాజు, తుమ్మల సునీత, తిరిది ఎల్లియమ్మ, బంగారు సత్యనారాయణ, అమన్ జైన్, చింతలపూడి రవి, మమతా శ్రీనివాస్, చింతా పేర్రాజు, గోరుసు దుర్గారావు, బుంగా నాగరాజు, జగన్, అరాదాడి శివ, అంగడి దుర్గారావు, చిక్కాల సత్యవతి, తెప్పల లింగ, నాగ కుమారి, కాకినాడ సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు