కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి పెద్దపీట : కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ…
6th sense TV:కాకినాడ జిల్లా:
కాకినాడ రూరల్: అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) పేర్కొన్నారు. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం గంగనాపల్లి, చీడిగ, ఇంద్రపాలెం గ్రామాల్లో రూ.2.10 కోట్ల ఉపాధి హామీ నిధులతో నిర్మించనున్న పలు సిమ్మెంట్ రోడ్లు, డ్రైనేజీలు, కనెక్టింగ్ లింక్ రోడ్ల నిర్మాణ పనులకు కూటమి నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస బాబా, శిరంగి శ్రీనివాసరావు, తడాల అబ్బు, మహేష్ కుమార్, పితాని అప్పన్న, వాసంశెట్టి అంజిబాబు, కౌజు నెహ్రు, మాసుమేను గంగయ్యలతో కలసి భూమి పూజా నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆగస్టు 22న నిర్వహించిన గ్రామసభలో ప్రజల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు రూ. 12.36 కోట్లు మంజూరు కావడం జరిగిందన్నారు. గ్రామాల్లో జరుగుతోన్న పనుల్లో ప్రజాభాగస్వామ్యం ఉండాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ కరప మండల అధ్యక్షుడు దేవు వెంకటేశ్వరరావు,గంగనాపల్లి సర్పంచ్ గీసాల మహాలక్ష్మి, ఎంపీడీవో పసపులేటి సతీష్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు కే శ్రీనివాసరావు, గోవిందరాజులు, శివ ప్రసాద్, నాయకులు ముమ్ముడి రాధాకృష్ణ, పాండ్రంకి రాజు, పెంకే గోవిందు, గుత్తుల చిన్ని, దొమ్మేటి వెంకటరమణ, పండూరు జయకృష్ణ, సరిదే నాగ హరినాథ్ తదితరులు ఉన్నారు.