*కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్*….?
6th sense TV: తెలంగాణ:
హైదరాబాద్:సెప్టెంబర్ 19
గత మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న డాన్స్ మాస్టర్ జానీ ని హైదరా బాద్ ఎస్ఓటీ, పోలీసులు బెంగళూరులో ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు…
ఓ మహిళా డాన్సర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడి పరారీలో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ ఈ మేరకు ఆయనను హైదరాబాద్‌కు తీసుకొచ్చేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కేసు నమోదైన నాటి నుంచి జానీ మాస్టర్ నెల్లూరుకు పారిపోయాడని, హైదరాబా ద్ నగరంలోనే ఓ స్నేహితు డి ఇంట్లో తలదాచుకుంటు న్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి.
అయితే, ఆయనను వెతికేందుకు మొత్తం నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. అలాంటి వార్తలకు చెక్ పెడుతూ.. ఇవాళ సైబరాబాద్ పోలీసులు జానీ మాస్టర్‌ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఇప్పటికే ఇలాంటి ఆరోపణలతోనే ఆయన గతంలో 6 నెలల పాటు జైలు జీవితం కూడా గడిపినట్లుగా తెలుస్తోంది….