తాజా వార్తలు

గంజాయి ఇచ్చి ఏడాదిగా యువతిపై అత్యాచారం..



10 వ తరగతి అమ్మాయిలను ట్రాప్ చేసి…

శిశు సంరక్షణ కమిటీ సీరియస్….

6th sense TV:జగిత్యాల జిల్లాలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికి ట్రాప్ చేసిన ఓ ముఠా గంజాయికి బానిసలు చేసింది. ఈ క్రమంలోనే మత్తుకు బానిసైన ఆ బాలికకు చాక్లెట్ల రూపంలో గంజాయి ఇచ్చేవారు. అలా రోజు ఆ మత్తుకు బానిసైన బాలికను.. గంజాయి ఆశచూపి, రేవ్ పార్టీల పేరుతో వ్యభిచారానికి తరలిస్తున్నారు. ఇక ఈ క్రమంలోని మత్తుకు బానిసైన ఆ అమ్మాయి వింతవింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అయితే మొదట్లో ఈ విషయాన్నిఆ బాలిక తల్లిదండ్రుల అంతగా గమనించ లేదు. కానీ రాను రాను ఆ బాలిక మరి విచిత్రంగా ప్రవర్తిస్తుండటంతో.. తండ్రికి అనుమానం వచ్చింది. దీంతో ఎందుకిలా ప్రవర్తిస్తుందో తండ్రికి అనుమానం వచ్చి ఆరాతీయగా.. ఆమెకు గంజాయికి అలావాటు పడిందని తండ్రికి తెలిసింది. దీంతో ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇక ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన శిశు సంరక్షణ కమిటీ.. వెంటనే దర్యాప్తు చేపట్టింది. ఈ విచారణలో భాగంగానే మరిన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఎందకుంటే.. ఈ మత్తులో బాధిత అమ్మాయి కాకుండా.. మరో 10 మంది పదో తరగతి చదువుతున్న బాలికలు బానిసలుగా ఉన్నరని తేలింది.ఇక ఈ మత్తుకు బానిసలైన వారంతా మధ్య తరగతి కుటుంబాలకుచెందినవారిగా గుర్తించారు. దీంతో అసలు ఈ అమ్మాయిలకు ఎక్కడి నుంచి గంజాయి అందిందని మరింత లోతుగా విచారణ జరపగా.. దీని వెనుక ఓ సెక్స్ రాకెట్ ముఠా ఉన్నట్టు వెలుగులోకొచ్చింది. కాగా, ఆ ముఠా బాలికలను గంజాయికి బానిసలను చేయడమే కాకుండా.. వారిని హైదరాబాద్‌లోని రేవ్ పార్టీలకు కూడా తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఇక అలా వెళ్లిన ప్రతి పార్టీకి గాను ఈ మూఠా రూ.30 వేలు చెల్లిస్తున్నట్లు వెల్లడైంద. ఈ తరుణంలోనే.. నార్కొటిక్ బ్యూరో అధికారులు రంగంలోకి దిగి ఆ సెక్స్ రాకెట్ ముఠాపై లోతుగా దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగానే జాగిత్యాల జిల్లా ఓ గ్రామం శివారులో.. ఈ అమ్మాయిలకు గంజాయికి బానిసలు చేసే వారిలో ప్రధాన నిందితులుగా ప్రేమ్, వెంకటేశ్ , నితిన్ గా పోలీసులు గుర్తించారు. ఇక వారి ముగ్గురిపై పోక్సో, NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అయితే భాదితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఈ సంచలన ఘటన బయటపడటంతో రెండు తెలుగు రాష్ట్రల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మరి, ఈ కేసు పై మరిన్నీ నిజాలు త్వరలోనే బయటకు రానున్నాయి.

6th Sense Tv

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

తాజా వార్తలు

If you went round the world which places could

Grursus mal suada faci lisis Lorem ipsum dolarorit ametion consectetur elit. a Vesti at bulum nec odio aea the dumm
తాజా వార్తలు

We believe Apple Will announce iPhone.

Grursus mal suada faci lisis Lorem ipsum dolarorit ametion consectetur elit. a Vesti at bulum nec odio aea the dumm