గంజాయి డ్రగ్స్, దొంగతనాలకు అడ్డాగా మారిన తూరంగి…?
.
కాకినాడ జిల్లా: కాకినాడ రూరల్:
ప్రాణభయంతో అల్లాడుతున్న ప్రజలు.
నివారణా చర్యలు తీసుకోవాలని డిమాండ్.
తూరంగి 29-9-2024: ఈరోజు బొడ్డు చెరువు తూరంగి ప్రాంతంలో జయప్రకాష్ నారాయణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జోగా అప్పారావు అధ్యక్షతన పత్రికా సమావేశం జరిగింది.
ఈసంద్భంగా కమిటీ అధ్యక్షులు జోగా అప్పారావు మాట్లాడుతూ తూరంగిలో గత నాలుగు సంవత్సరాలుగా మద్యం గంజాయి డ్రగ్స్ కేసులు, ఇళ్ళలో దొంగతనాలు విపరీతంగా పెరిగడం తో ప్రజలు ప్రశాంతంగా జీవించ లేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ప్రాంతంలో పాలిటెక్నిక్ , msn కళాశాల, హై స్కూల్స్ లో చడుతున్న వేలాది విద్యార్దులకు నిలయమైన ఈ ప్రాంతంలో విచ్చల విడిగా ఈ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా అధికారులు వీటిని నివారించక పోవడంతో ప్రజలు , విద్యార్దులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
విచ్చల విడిగా బహిరంగ ప్రదేశాలలో మందు బాబులు మందు సేవించడం,
వందలాదిమంది మహిళలు వృద్ధులు వాకింగ్ చేయుచున్న బొడ్డు చెరువు ప్రాంతంలో రాత్రులు పగలు గంజాయి డ్రగ్స్ మద్యం సేవిస్తున్నారని, ఇది గత ఆరు నెలలుగా జరుగుతున్నా పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం ఇచ్చట కాపలా కూడా లేని కారణంగా మద్యం సేవించి మహిళలను ఇబ్బంది పెడుతున్నారని ఆయన తెలిపారు. ఆంధ్రపాలిటెక్నిక్ ప్రక్కన నాయక రోడ్లో మద్యం , డ్రగ్స్ గంజాయి సేవించుచున్నారని ఆ రోడ్లో వెళ్లే మహిళపై గతంలో దాడి కూడా చేశారని ఆయన గుర్తుచేశారు. ప్రక్కన ఆంధ్ర పాలిటెక్నిక్ దగ్గర్లో జిల్లా పరిషత్ హై స్కూలు ఉన్నవని వాటిలో చదువుతున్న పిల్లలపై కూడా ఈ డ్రగ్స్ ప్రభావం పడుతుందని తెలిపారు. పంచాయతీ రోడ్డు చీకటిమయంగా ఉందని కనీసం లైట్లు వేయమని కోరినప్పటికీ వీధిలైట్లు కూడా పంచాయతీ వారు వేయలేదని గుర్తుచేశారు.
తూరంగి స్మశానం చుట్టూ డ్రగ్స్ బ్యాచి రాత్రులు తెల్లవారులు మద్యం సేవిస్తూ పెద్దపెద్ద కేకలతో చుట్టుపక్కల వారిని భయభ్రాంతులను చేస్తున్నారని ఆయన తెలిపారు.
గౌరవఅధ్యక్షులు టి.స్వామి నాయకర్ మాట్లాడుతూ డ్రగ్స్ గంజాయి సేవించి రాత్రి ఒంటిగంట తర్వాత జయప్రకాష్ నగర్ లో గత సంవత్సర కాలంలో ఆరు చోట్ల దొంగతనాలు జరిగాయని తెలిపారు. గత 2023 అక్టోబర్ నెలలో టి.స్వామి నాయక్ గారి ఇంట్లో దొంగలు ఇంట్లోని సామాన్లు దొంగతనం చేశారని అది పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ కూడా చేయడం జరిగిందని తెలిపారు. దాని తర్వాత వరుసగా సిద్ధి వినాయక హోటల్ ఎదురు వీధిలో ఇంటి తలుపులు బద్దలు కొట్టి దొంగలు బీభత్సం సృష్టించారని, అక్కడనుండి వెళ్లి చర్చి ప్రక్కన కిరణ్ గారింట్లో తలుపుల గెడలు బద్దలు కొట్టారని వారు తెలిపారు. మరయు టి.స్వామి నాయక్ గారి ఇంటి వెనక శ్రీరాములు గారి ఇంట్లో, చర్చికి దగ్గరలో రెండు ఇళ్లలో మోటార్లు పట్టుకుపోయారని, మిలటరీ రోడ్డు పక్క వీధిలో ఇంటి గెడలు బద్దలు కొట్టారని, కిటికీనుండి సెల్ పట్టుకుపోయారు అని తెలిపారు.
వీటిపై జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ వారికి సోమవారం 23 – 9-20 24 న కంప్లైంట్ ఇచ్చామని అయినప్పటికీ మరుసటి రోజునే అనగా మంగళవారం 24 – 09-20 24న జయప్రకాష్ నగర్ జెడ్పీ హైస్కూల్ ఎదురువీధిలో ఉన్న అడ్వకేట్ డి.నాగబాబు గారి ఇంట్లో రాత్రి ఒంటిగంట 45 నిమిషాలకు దొంగ వచ్చి బీరువాలో ఉన్న వెండి సామాన్లు నగదు చెవి రింగులు తీసుకొని ప్రక్క గదిలో నిద్రిస్తున్న నాగబాబు గారి ప్రక్కన ఉన్న సెల్లు మెడలో ఉన్న బంగారు చైను తెంపి పట్టుకొని వెళ్లిపోయారని , ఆయన ప్రాణహాని నుండి బయట పడ్డారని తెలిపారు.
విచ్చలవిడిగా గంజాయి డ్రగ్స్ మద్యం పబ్లిక్ ప్రదేశాలలో సేవించడం, తరచు దొంగతనాలు జరగడం కారణంగా జయప్రకాష్ నగర్ మరియు తూరంగి ప్రజలు భయభ్రాంతులతో జీవిస్తున్నారని ఆయన తెలిపారు.
సెక్రటరీ డి. నాగబాబు మాట్లాడుతూ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ వారికి ఇచ్చిన కంప్లైంట్ పై నిన్న ఇంద్రపాలెం ఎస్సై శ్రీ వీరబాబు గారు వచ్చారని ఆయనకు గంజాయి డ్రగ్స్ జీవిస్తున్న ప్రదేశాలన్నీ చూపించామని వీటికి నివారణ చర్యలు చేపడతామని ఆయన తెలిపారని చెప్పారు.
తూరంగి గ్రామాన్ని మద్యం గంజాయి డ్రగ్స్ బారి నుండి రక్షించి దొంగల బెడద లేకుండా ప్రశాంతంగా జీవించేలా పోలీసులు, పంచాయతీ అధికారులు తగిన చర్యలు తీసుకుని ప్రజలకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు కూడా రోజూ రాత్రులు పెట్రోలింగ్ నిర్వహించాలని కోరుతున్నా మన్నారు.
ఈ కార్యక్రమంలో నంది కోళ్ళ రమేష్, కాళ్ళ గోపాలస్వామి, బంగారం, కిరణ్, కె.తాత బ్బాయి, ch. అజయ్ కుమార్ , కార్తీక్ , ప్రసాద్, సత్యనారాయణ, రమణ మరియూ స్థానిక ప్రజలు పెద్దయెత్తున పాల్గొన్నారు.