గ్రామీణ ఉపాధి హామీ 200 రోజులు పని దినాలు 600రూపాయలు వేతనం పెంచాలని……
6th sense tv,కాకినాడ రూరల్ ఫిబ్రవరి 24
ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టండి
రాజకీయ పార్టీలకు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్
కాకినాడ జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వాలు చేర్పిస్తున్న జిల్లా నాయకులు
కాకినాడ రూరల్ ఫిబ్రవరి 24:
శ్రమను నమ్ముకుని రెక్కలు ముక్కలుగా చేసుకుని కడుపు నింపుకుంటున్న కష్టజీవులకు
కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు మేరకు భూ పంపిణీ చేయాలని గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి 200 రోజులు పని దినాలు కల్పించి 600 రూపాయలు వేతనం చెల్లించాలని ఈ డిమాండ్లను అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు
శనివారం ఉదయం 7 గంటల నుండి కాకినాడ రూరల్ పండురు నేమం తమ్మవరం పెనుమర్తి సూర్యారావుపేట తదితర గ్రామాల్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పర్యటన జరిగింది
ఈ పర్యటనలో కూలి దండు మాసపత్రిక సభ్యత్వాలు చేర్పించడం జరిగింది
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలు పోరాట ఫలితంగా ఏర్పడిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తుందని దీన్ని ప్రతి ఒక్కరు తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలి వేతనం 600 చేయాలని వలస కార్మికులను ఆపాలంటే 200 రోజులు పని దినాలు కల్పించాలని మధు డిమాండ్ చేశారు
కాకినాడ జిల్లాలో ఉన్న ప్రభుత్వ బంజర్లు రెవిన్యూ పోరంబోకు భూదాన భూములు భూస్వాముల ఆధీనంలో ఉన్న మిగులు భూములు తదితర అన్ని రకాల భూములను ప్రభుత్వం గుర్తించి పేదలకు పంపిణీ చేయాలన్నారు వ్యవసాయ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం చేయాలని సామాజిక భద్రత మహిళలకు రక్షణ కల్పించాలని మధు డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడులు అరికట్టి నేరస్తులను శిక్షించాలని మధు డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కేశవరపు అప్పలరాజు ఉపాధ్యక్షులు శాఖ రామకృష్ణ రైతు సంఘం నాయకులు ఎం శ్రీనివాసరావు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సుజాత రత్నప్రభ సామ్యూల్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు