చిన్నారిని ఎలా కాపాడారో చూడండి…
6th sense TV: చెన్నై:చెన్నైలో ఓ ఏడు నెలల చిన్నారి ప్రమాదవశాత్తూ అపార్ట్మెంట్ నాల్గవ అంతస్తు నుంచి కిందకు జారింది. అదృష్టవశాత్తూ మరో అంతస్తు అంచున పడి ఆగింది. దీంతో చిన్నారిని రక్షించేందుకు హౌసింగ్ సొసైటీలోని పలువురు ముందుకొచ్చారు. బెడ్ షీట్లు పట్టుకొని కొంతమంది కింద నిల్చోగా, ఇద్దరు వ్యక్తులు పైకెక్కి చిన్నారిని రక్షించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారగా, చిన్నారిని రక్షించిన వారిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.