చిన్నారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిన హోంమంత్రి..
6th sense TV:*తిరుపతి జిల్లా, వడమాల పేట, అలివేలు మంగాపురం, ఎస్టీ కాలనీ*
హోం మంత్రి మీడియా తో మాట్లాడుతూ…..
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వడమాలపేట (మం.) అలివేలు మంగాపురం ఎస్టీ కాలనీ చేరుకున్న హోం మంత్రి వంగలపూడి అనిత..
అఘాయిత్యానికి గురై హత్య చేయబడిన చిన్నారి తల్లిదండ్రులకు 10లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేత…
చిన్నారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిన హోం మంత్రి…
నిందితుడికి 2 నుండి 3 నెలల్లో కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నాం.. తల్లిదండ్రులకు హామీ ఇచ్చిన హోం మంత్రి
ముఖ్యమంత్రి ఇలాంటి హత్యాచారాలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
గత ప్రభుత్వంలో అనేక హత్యాచారాలు జరిగాయి అప్పుడు రాని వారు అందరూ నేడు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రాజకీయ లబ్ది కోసం పాకులాడడం సరైనది కాదు. దేవుడు కూడా ఇలాంటి వారిని క్షమించడు.
మా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి గల ప్రభుత్వం..
గత ప్రభుత్వ హయాంలో సిసి కెమెరాలు నిర్వీర్యం చేసి గంజాయి, నకిలీ మద్యం విచ్చల విడిగా యువతకు అలవాటు అయ్యేలా నిస్తేజంగా వ్యవహరించారు.
గత ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖను నిర్వీర్యం చేశారు.
బాధితుల పక్షాన నిలబడడమే కాదు, ఎలాంటి సంఘటనలు జరగకుండా మహిళలకు అండగా చర్యలు తీసుకుంటున్నాం….
మహిళా సాధికారతకు, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంది…
టీడీపీ ప్రభుత్వం గతంలోనే మహిళా సాధికారత దిశగా మొట్ట మొదటగా మహిళా పొదుపు సంఘాలు ఏర్పాటు చేసింది…
గంజాయి సాగును అరికట్టి, గంజాయి నిర్మూలనకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం. నార్కోటిక్ వింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. గాంజా పై ఉక్కుపాదం మోపి కట్టడి చేస్తున్నాం..
ప్రజలకు వారి ఆకాంక్షలకు అనుగుణంగా.. ప్రజా సంక్షేమ, అభివృద్ధికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం.
చిన్నారిపై అఘాయిత్యం బాధేసింది…
చాక్లెట్ కొనిస్తానని అత్యాచారం చేసి హత్యచేయడం మరింత బాధించింది…
అలిమేలుమంగాపురం ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది…
ప్రభుత్వం చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుంది..
చిన్నారి కుటుంబానికి సొంత ఇంటిని నిర్మించి ఇస్తాం..
ఘటన జరిగిన తరువాత నిందితుడిని వెంటనే అరెస్ట్ చేశాం..
పోలీసులు వెంటనే స్పందించారు…
మద్యం మత్తులో నిందితుడు దారుణానికి ఒడిగట్టాడు…
బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం.
గత ఐదేళ్ళలో పోలీసు వ్యవస్థను వైసిపి నిర్వీర్యం చేసింది..
ఈ ఘటనను రాజకీయం చేయడం విడ్డూరం…
ఎక్కడ ఘటన జరిగినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తోంది…
చిన్నపిల్లల మరణాల్ని వైసిపి రాజకీయం చేయడం బాధాకరం…
క్రైం రికార్డు చూస్తే గత ఐదేళ్ళలో ఎన్నో ఘటనలు జరిగాయి..
పులివెందులలో మహిళపై అత్యాచారం జరిగితే జగన్ ఎందుకు నిందితుడిని శిక్షించలేదు…
ఎపిలో సిసి కెమెరాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం…
దిశ యాప్ అంటూ రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు..
చంద్రబాబు ప్రతి ఆడబిడ్డను సొంత బిడ్డగా చూస్తున్నారు…
చంద్రబాబును విమర్సించే అర్హత జగన్ కు లేదు…
వైసిపి హయాంలో మద్యం ఏరులై పారింది..అప్పుడు రోజాకు తెలియలేదా..?
మద్యంపై రోజా చేస్తున్న రాద్ధాంతం హాస్యాస్పదం..