టిడిపి ప్రభుత్వంలోనే టైలర్స్ కు సంక్షేమ పథకాలు….
6th sense TV:కాకినాడ: టైలర్స్ డే కార్యక్రమంలో కొండబాబు
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో టైలర్స్ కు అనేక సంక్షేమ పథకాల అమలు చేయడం జరిగిందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ అన్నదాన సమాజంలో కాకినాడ టౌన్ & రూరల్ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
నవ్యాంధ్ర రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ జిల్లా ఇంచార్జ్ ఏఎస్ఎన్ మూర్తి, కాకినాడ జిల్లా అధ్యక్షులు టి. చిట్టిబాబు
ఆధ్వర్యంలో టైలరింగ్ మిషన్ సృష్టికర్త విలియమ్స్ హో చిత్రపటానికి కొండబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ టైలర్స్ ఆర్థిక అభివృద్ధి తోడ్పాటుకు గత తెలుగుదేశం పార్టీ హయాంలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కల్పించి కుట్టు మిషన్ అందించి, సబ్సిడీ రుణాలు అందించి టైలర్స్ ను ఆదుకోవడం జరిగిందని, నేడు వైసీపీ ప్రభుత్వంలో టైలర్లకు రుణాలు కూడా అందించలేని పరిస్థితి నెలకొందని, టైలర్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తే రుణాలు వస్తాయని సూచించడంతో కాకినాడ టౌన్ & రూరల్ అసోసియేషన్ తో పాటు ఫెడరేషన్ కూడా టైలర్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి రాగానే టైలర్స్ అభివృద్ధికి మరింత కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టైలర్స్ అసోసియేషన్ సభ్యులు పి. రామదాసు, ఎన్. సత్తిరాజు, కాకినాడ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రఘుబాబు, రాధాకృష్ణ, ట్రెజరర్ కృష్ణారావు, సభ్యులు దుర్గారావు నాగేశ్వరరావు, మురళీకృష్ణ శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు జి. సుగుణ, తదితరులు పాల్గొన్నారు.