టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్….
6th sense TV:నంద్యాల:
టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. సీఎం జగన్ సభ దగ్గర ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు.
ఇందులో భాగంగా ఇవాళ ఆయన నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. నంద్యాలలో వైసీపీ బహిరంగా సభ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో వైసీపీ సభ దగ్గరకు వెళ్లిన అఖిల ప్రియ సాగునీటి విడుదల కోసం సీఎం జగన్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆమెతో పాటు టీడీపీ శ్రేణులు సైతం భారీగా తరలివెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అఖిలప్రియను, టీడీపీ శ్రేణులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.