ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం…!
6th sense TV: కాకినాడ:ఈరోజు *(08.07.2024)* వ తేదీన, గౌరవనీయులైన కాకినాడ జిల్లా ఎస్పీ గారు *శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఐపిఎస్* వారి ఉత్తర్వులు మేరకు, కాకినాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారి డాక్టర్. K .హనుమంతరావు గారి పర్యవేక్షణలో *”కాకినాడ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ”* వారి ఆధ్వర్యంలో కాకినాడ పట్టణంలో, జిలాని సెంటర్ నందు ట్రాఫిక్ 1 ఇన్స్పెక్టర్, శ్రీ N .రమేష్ గారు వారి సిబ్బంది , కాకినాడ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ పానెల్ అడ్వకేట్ డాక్టర్ Y. వసంత గారు, కాకినాడ ఆర్టీవో B.మురళీకృష్ణ గారు వారి సిబ్బంది, కాకినాడ డిస్ట్రిక్ట్ రోడ్డు సేఫ్టీ మెడికల్ ఆఫీసర్ A.V. పద్మావతి గారు, సంయుక్తంగా నిర్వహించిన *ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం* లో భాగంగా రోడ్ యాక్సిడెంట్లను నిర్మూలించాలనే ఉద్దేశంతో వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలుగు నష్టాలను, మితిమీరిన వేగంతో నడపడం వల్ల కలిగే నష్టాలను, ద్విచక్ర వాహనాలకు అమర్చబడిన మోడీఫైడ్ సైలెన్సర్ల వల్ల వచ్చు శబ్దకాలుష్యం వల్ల ప్రజలకు కలుగు ఇబ్బందులను గురించి, వాహనాలకు అమర్చిన డెఫెక్టీవ్/సక్రమం గా లేని నెంబర్ ప్లేట్లు వల్ల కలుగు నష్టాలను గురించి, ఆటో డ్రైవర్లకు వారి యొక్క ఆటోలలో పరిమితికి మించి పాసింజర్లను ఎక్కించరాదని, తల్లిదండ్రులు మైనర్లు అయిన వారి పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని, టూ వీలర్స్ పై ఇద్దరి కన్నా ఎక్కువమంది ప్రయాణించరాదని, సదరు విషయాల గురించి ప్రజలకు తెలియపరచి వారిలో చైతన్యం తీసుకురావాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం వాహన చోదకులకు అందరికీ పుష్పాలు 💐🌷 పంచిపెట్టి వినతి పూర్వకంగా తెలియపరచడం జరిగింది.
ఇకపై, పైన తెల్పిన ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంగించినచో యడల వారిపై కఠిన చర్యలు చట్టప్రకారం తీసుకునబడునని తెలియపర్చడమైనది.
*ఇట్లు*
CI ట్రాఫిక్- 1 & 2 PS Kakinada.,