ట్రాఫిక్ రూల్స్ పై అవగాహనలో భాగంగా…
6th sense TV: కాకినాడ జిల్లా: కాకినాడ సిటీ
ఈరోజు (16.11.2024) వ తేదీన, రోడ్డు ఆక్సిడెంట్ లు తగ్గించాలనే ఉద్దేశంతో గౌరవనీయులైన కాకినాడ జిల్లా ఎస్పీ *శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్.,* గారి ఉత్తర్వులు మేరకు మరియు కాకినాడ *SDPO శ్రీ రఘువీర్ విష్ణు* గారి పర్యవేక్షణ లో , కాకినాడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మరియు SIs లు జగన్నాధపురం, ముత్తనగర్ లో ఉన్న *” సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ విద్యార్థులకు “* *ట్రాఫిక్ రూల్స్ & రెగ్యులేషన్ పైన, హెల్మెట్ వాడకం* పైన అవగాహన కల్పించు నిమిత్తం అవర్నెస్ మీటింగ్ నిర్వహించడం అయినది.
✍️ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహనలో భాగంగా…
1) మోటార్ సైకిల్స్ నడిపే ప్రతి ఒక్కరు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని, ఈ విషయమై తమ తల్లి తండ్రులకు తెలియజేయాలనీ,
2) ట్రిపుల్ రైడింగ్, బైక్ స్టంట్స్, మైనర్ డ్రైవింగ్ చేయరాదని.
3) వాహనములను అతి వేగముగా నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వలన కలుగు ప్రమాదాలు గురించి వారికి వివరించడం జరిగినది.
4) రోడ్లు దాటేటప్పుడు తప్పనిసరిగా లెఫ్ట్ రైట్ చూసుకొని దాటాలని చెప్పడమైనది
ఇట్లు
*CI ట్రాఫిక్ 1 పీస్* కాకినాడ.