తెల్లవారుజామున 4.00 గంటల నుండి కౌంటింగ్ ….?
6th sense TV:కాకినాడ జిల్లా:
కాకినాడ, తేది. 04.06.2024
దివి.04-06-2024 వ తేదీన కాకినాడ జిల్లా పరిధిలోని కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం మరియు కాకినాడ జిల్లాలోని గల 7-అసెంబ్లీ నియోజకవర్గములకు సంబందించి *సార్వత్రిక ఎన్నికలు-2024 ఓట్ల లెక్కింపు* కాకినాడ JNTU క్యాంపస్ మరియు JNTU స్టేడియం నందు జరుగు సందర్భంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణనను దివి. 04-06-2024 వ తేదీ తెల్లవారుజామున 4.00 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఈ క్రింది విధంగా ట్రాఫిక్ ను మళ్ళించడమైనది. కావున ప్రజలు సహకరించవలసిందిగా కోరడమైనది.
1) *పిఠాపురం నుండి కాకినాడ, అమలాపురం, రామచంద్రాపురం, పెదపూడి వైపు వెళ్ళవలసిన వాహనములను ఈ క్రింది మార్గములో మళ్ళించడమైనది*.
పిఠాపురం, చిత్రాడ నుండి తిమ్మాపురం Y-జంక్షన్ వద్ద కుడి వైపునకు తీసుకోని కొత్తగా వేసిన బై-పాస్ మార్గము ద్వారా వెళ్లి ADB రోడ్ లోకి ప్రవేశించి – కొప్పవరం జంక్షన్ నుండి కుడి వైపునకు తీసుకోని ఉండూరు బ్రిడ్జి మీదగా సామర్లకోట వెళ్ళు వారు కుడివైపునకు, ఇంద్రపాలెం వెళ్ళు వారు ఎడమ వైపు వెళ్ళవలెను.
కాకినాడ పట్టణంలోకి వెళ్ళవలసిన వారు ఉండూరు బ్రిడ్జి వద్ద ఎడమ వైపునకు తీసుకోని కెనాల్ రోడ్ మీదుగా మాధవపట్నం- ప్రతాప్ నగర్ బ్రిడ్జి –ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద ఎడమ వైపు తీసుకోని వారి గమ్యములకు చేరవలెను.
పెదపూడి, రామచంద్రాపురం, యానాం మరియు అమలాపురం వెళ్ళవలసిన వాహనదారులు పై మార్గములో వచ్చి ఇంద్రపాలెం బ్రిడ్జి నుండి కుడి వైపునకు తీసుకోని చీడిగ కొత్త బై-పాస్ మీదుగా నేరుగా పెదపూడి వైపు వెళ్ళవలెను,
రామచంద్రాపురం మరియు ద్రాక్షారామ వైపునకు వెళ్ళవలసిన వాహనదారులు పై మార్గము ద్వారా వచ్చి చీడిగ కొత్త గా నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఎడమ వైపునకుతీసుకోని బై-పాస్ మీదగా(NH-216) తురంగి బ్రిడ్జి వద్దకుడి వైపునకు తీసుకోని రామచంద్రాపురం మరియు ద్రాక్షారామవైపు వెళ్ళ వచ్చును.
తాళ్ళరేవు, యానాం మరియు అమలాపురం వెళ్ళ వలసిన వాహనదారులు పై మార్గము ద్వారా వచ్చి తురంగి బ్రిడ్జి నుండి నేరుగా ఉప్పలంక Y-జంక్షన్ మీదగ యానాం మరియు అమలాపురం వెళ్ళ వచ్చును.
2) *కాకినాడ, సామర్లకోట, పిఠాపురం, తుని, విశాఖపట్నం వైపు వెళ్ళవలసిన వాహనదారులు ఈ ఈ క్రింది మార్గముల లో మళ్ళించడమైనది*.
అమలాపురం మరియు యానాం మీదుగా వచ్చు వాహనదారులు ఉప్పలంక Y-జంక్షన్ వద్ద నుండి ఎడమ వైపునకు తీసుకోని తూరంగి బ్రిడ్జి మీదగా చీడిగ బ్రిడ్జి వద్దకు చేరుకొని కుడి వైపునకు తీసుకోని ఇంద్రపాలెం బ్రిడ్జి మీదుగా ఎడమ వైపునకు తీసుకోని కెనాల్ రోడ్ లో సామర్లకోట వెళ్ళవచ్చును, అదే విధముగా ఇంద్రపాలెం బ్రిడ్జి వద్దనుండి కుడి పైపునకు తీసుకోని కాకినాడ నగరంలోకి ప్రవేశించవచ్చును.
పిఠాపురం వెళ్ళవలసిన వాహనదారులు సామర్లకోట మీదుగా గాని లేక కెనాల్ రోడ్ లో గల ఉండూరు బ్రిడ్జి వద్ద కు చేరుకొని అక్కడ నుండి కుడి వైపునకు తీసుకోని ADB రోడ్లో గల కొప్పవరం జంక్షన్ వద్ద కొత్తగా నిర్మాణంలో ఉన్న (NH-216) బ్రిడ్జి వద్ద ఎడమ వైపునకు తీసుకోని తిమ్మాపురం Y-జంక్షన్ నుండి పిఠాపురం వైపు వెళ్ళ వచ్చును.
3) *కాకినాడ పట్టణం నుండి సామర్లకోట, పిఠాపురం వెళ్ళవలసిన వాహనదారులు ఈ ఈ క్రింది మార్గముల లో మళ్ళించడమైనది*.
భానుగుడి జంక్షన్ నుంచి ముత్తాగోపాల కృష్ణ బ్రిడ్జి మీదుగా శారదదేవి గుడి – కర్ణంగారి జంక్షన్ నుండి కుడి వైపునకు తీసుకోని SV రంగారావు విగ్రహం -గైగాలపాడు జంక్షన్ – సర్పవరం పూల మార్కెట్ మీదుగా మాధవపట్నం సెంటర్ – కెనాల్ రోడ్ మీదగా సామర్లకోట మరియు పిఠాపురం వెళ్ళవచ్చును. అదేవిధముగా సర్పవరం పూల మార్కెట్ నుండి పనసపాడు మీదుగా ADB రోడ్ లోకి ప్రవేశించి కొప్పవరం జంక్షన్ వద్ద కొత్తగా నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద నుండి కుడి వైపునకు తీసుకోని తిమ్మాపురం Y-జంక్షన్ మీదుగా పిఠాపురం వైపు వెళ్ళ వచ్చును.
4) *కాకినాడ పట్టణం లోని పోర్ట్ మరియు ఇతర ప్రాంతాలకి వెళ్ళు భారీ వాహనాలను కాకినాడ పట్టణం లోకి ప్రవేశిoచ కుండా నిలుపుదల చేయు ప్రదేశములు (కట్ ఆఫ్ పాయింట్లు*).
1. రాజానగరం నుండి సామర్లకోట వరకు గల ADB రోడ్ లో భారి వాహనాలను కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేవరకు నిలుపుదల చేసుకోవలెను.
2. కత్తిపూడి NH -16 బ్రిడ్జివద్ద నుండి కాకినాడ పోర్ట్ కి వచ్చు భారి వాహనములు కత్తిపూడి జంక్షన్ వద్ద NH-16 పై నిలుపుదల చేయవలెను.
3. లైట్ హౌస్:- (సూర్యారావుపేట జంక్షన్ వద్ద): ఉప్పడ బీచ్ రోడ్ నుండి వచ్చు భారివహనములను సూర్యారావుపేట జంక్షన్ వద్ద నిలుపుదల చేయవలెను.
4. ఉప్పలంక వై-జంక్షన్ (NH-216):- – యానాం నుండి కాకినాడ పోర్ట్ వైపు నకు వెళ్ళు భారివాహన ములను ఉప్పలంక వై-జంక్షన్ (NH-216) ముందే నిలుపుదల చేయవలెను.
5. ఉప్పాడవైపునుండి కాకినాడ నగరం లోకి వచ్చు భారీ వాహనాలు ఉప్పాడ కు ముందున నిలుపుదల చేయాలి.
*నిషిద్ధ ప్రదేశములు* .
కాకినాడ మరియు చుట్టూ ప్రక్కల ప్రదేశాల నుండి వచ్చు ప్రజలు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబందించని వాహనదారులకు ఈ క్రింది ప్రదేశాలలో ప్రవేశం నిషేడించడమైనది.
1) ఆశ్రమం పబ్లిక్ స్కూల్ – నాగమల్లి తోట జంక్షన్ – వినాయక కేఫ్ – అమ్మవారి టెంపుల్ – DSA స్పోర్ట్స్ గ్రౌండ్ – RTO ఆఫీస్ జంక్షన్ -కమ్మ కళ్యాణమండపం సెంటర్ నుండి రామకోస జంక్షన్ – మెన్స్ హాస్టల్ సెంటర్ – ఫారెస్ట్ ఆఫీస్ రోడ్ (కలెక్టర్ గారి బంగ్లారోడ్) -AR lines, భానుగుడి జంక్షన్, ఓల్డ్ DPO -గవర్నమెంట్ ITI – ఎక్సిబిషన్ గ్రౌండ్ మరియు JNTU క్యాంపస్ చుట్టూ మద్యలో ఉన్న ప్రదేశాలలో వాహనదారులు మరియు ప్రజలు ప్రవేశించడం పై నిషిద్ధ ఆంక్షలు ఉన్నవి కావున గమనించగలరు. పై ప్రదేశములలో నివసించే ప్రజలు వారు వ్యక్తిగత పనులకు రాకపోకలు రామకోస జంక్షన్ వద్దనుండి మాత్రమే అనుమతించబడును.
*వాహనదారులు JNTUK పరిసర ప్రాంతాలకు రాకుండా ఈ క్రింది జంక్షన్ ల వద్ద నుండి ట్రాఫిక్ మళ్ళించడమైనది* .
1. అచ్చంపేట జంక్షన్ – సర్పవరం జంక్షన్ – గంగరాజు నగర్ T- జంక్షన్ – RTO ఆఫీస్ జంక్షన్ – అంబేద్కర్ విగ్రహం (గుడారిగుంట) – మదర్ తెరిస్సా విగ్రహం – కోకిల సెంటర్.
2. భానుగుడి జంక్షన్ – కర్ణం గారి జంక్షన్ – SV రంగారావు జంక్షన్ – గైగాలపాడు జంక్షన్ – సర్పవరం పూల మార్కెట్- మాధవపట్నం జంక్షన్.
*గమనిక*:
1. ఎలెక్షన్ కౌంటింగ్ నకు హాజరగు పోటీ చేసిన అభ్యర్థులు మరియు వారి యొక్క ఏజెంట్లకు పై ట్రాఫిక్ నిబంధన యందు సడలింపు కలదు. వారి యొక్క వాహనములను పెద్దాపురం నియోజకవర్గ మినహా మిగిలిన ఆరు నియోజకవర్గంలో అనగా కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం మరియుతుని కు సంబంధించిన అభ్యర్థులు మరియు ఏజెంట్లు వారి వాహనములను జేఎన్టీయూకు ఎదురుగా గల ఎగ్జిబిషన్ గ్రౌండ్ మరియు ఐటిఐ కాలేజ్ గ్రౌండ్ నందు వారి వాహనములకు పార్కింగ్ గా ఇవ్వడం అయినది. పెద్దాపురం నియోజకవర్గఅభ్యర్థులు మరియు వారి యొక్క ఏజెంట్లకు స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ నందు పార్కింగ్ గా నిర్ధారించడమైనది.
2. ఎలక్షన్ కౌంటింగ్ హాజరగు కౌంటింగ్ ఏజెంట్లను ఉదయం ఏడు గంటలు దాటిన తర్వాత కౌంటింగ్ హాల్ నందు అనుమతించబడదు. కావున ఉదయం 7 గంటల లోపు నే జేఎన్టీయూ కౌంటింగ్ సెంటర్ కు చేరుకుని లోపలికి ప్రవేశించవలెను.3. కౌంటింగ్ ప్రక్రియకు ఎలక్షన్ కమిషన్ చే అనుమతిగల వ్యక్తులకు మాత్రమే లోపలకు ప్రవేశం కలదు. మరి ఏ ఇతర వ్యక్తులకు లోపలకు ప్రవేశము నిషేధము. అట్టి వ్యక్తులను ఎవరిని అనుమతి గల వ్యక్తులు వారితో పాటుగా తీసుకుని రాకూడదు.
*ముఖ్య గమనిక*: కౌంటింగ్ ప్రక్రియకు హాజరగు కౌంటింగ్ ఏజెంట్లు మరియు అభ్యర్థులకు కౌంటింగ్ హాలులో ప్రవేశించక ముందు వారికి బ్రీత్ అనలైజర్ తో ఆల్కహాల్ మరియు డ్రగ్ టెస్టులు చేయబడును. ఎవరైనా మద్యం సేవించి లేదా ఏదైనా ఇతర నిషేధిత డ్రగ్ తీసుకుని కౌంటింగ్ ప్రాంతానికి వచ్చిన వారిని కౌంటింగ్ హాలులోనికి అనుమతించబడదు.
సూపరింటెండెంట్ అఫ్ పోలీస్,
కాకినాడ జిల్లా, కాకినాడ.