నోబెల్ వరల్డ్ రికార్డ్ సాధించిందన 4 నెలల పాప!!!
4 నెలల పాపకు నోబెల్ వరల్డ్ రికార్డ్
అమరావతి:-
నందిగామ పట్టణానికి చెందిన రమేష్ – హోమ దంపతుల కుమార్తె కైవల్య 4 నెలల వయసులోనే 120 రకాల పక్షులు, కూరగాయలు, పండ్లు, జంతువుల ఫొటోలను గుర్తిస్తూ నోబెల్ వరల్డ్ రికార్డ్ సాధించింది. దీని పట్ల కైవల్య తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. తల్లి హోమ మాట్లాడుతూ..
పాపలో ఉన్న టాలెంట్ బయటికి తీయాలనే ఉద్దేశంతో వీడియోలు నోబెల్ వరల్డ్ రికార్డుకు పంపామన్నారు.
వారు టెస్ట్ చేసి రికార్డ్ పత్రం అందజేసినట్లు తెలిపారు.