న్యూరో స్టార్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రారంభోత్సవం
6th sense TV: కాకినాడ జిల్లా:
కాకినాడ, అక్టోబర్ 13: కాకినాడలో నూతనంగా ప్రారంభించిన న్యూరో స్టార్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో వివిధ రాజకీయ నేతలు, నగర ప్రముఖులు సందడి చేశారు. ఆదివారం కాకినాడ నాగమల్లి తోట జంక్షన్లో ఉన్న న్యూరో స్టార్ ఆసుపత్రిలో వివిధ రకాల ఆధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన ఆసుపత్రి విభాగాలను పలువురు నేతలు ప్రారంభించారు. వీరికి ఆసుపత్రి అధినేత డాక్టర్ జ్యోతుల సతీష్ సాదరంగా ఆహ్వానించి ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన యంత్రాలను, పరికరాలను వివిధ విభాగాలను దగ్గరుండి చూపించారు
ఆసుపత్రిని సందర్శించిన వారిలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పౌరసరఫరాల శాఖ చైర్మన్ తోట సుధీర్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం తనయుడు సందీప్, సీటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు ) అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి, నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, గున్నం చంద్రమౌళి, మోకా ఆనంద్ సాగర్, తుమ్మల బాబు, నున్న దొరబాబు, చోడే సురేష్, డాక్టర్లు ఐవి రావు, ఎం బి ఆర్ శర్మ, ఏఎస్ కామేశ్వరరావు, ఎం అశోక్, యం రాఘవేంద్రరావు, మాకినీడి వీర ప్రసాద్, తదితరులు హాజరయ్యారు.