పిఠాపురంలో స్టిక్కర్ల సంస్కృతి ఫై ఉక్కుపాదం…?
6th sense TV:పిఠాపురం (Pithapuram) లో స్టిక్కర్ల సంస్కృతిపై పోలీసుల ఉక్కుపాదం మోపారు. పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లిలో పిఠాపురం MLA తాలుకా స్టిక్కర్లు ఉన్న వాహనాలను పట్టుకుంటున్నారు.
పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నారు. రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 4న ఫలితాలు వస్తుండటంతో పోలీసుల హై అలర్ట్ (High Alert) అయ్యారు.
కాగా, ఏపీ (Andhra Pradesh) వ్యాప్తంగా పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అంటూ స్టిక్కర్లు, బోర్డులు భారీగా వెలిశాయి. దీంతో జనసేన (Janasena) నేతలకు వైసీపీ (YCP) నాయకులు, కార్యకర్తలు కౌంటర్లు ఇస్తున్నారు. వైసీపీ డిప్యూటీ సీఎం వంగా గీత తాలుకా అంటూ స్టిక్కర్లు వెలిశాయి.
ఇటు పిఠాపురం వర్మ తాలుకా అంటూ కూడా భారీగా స్టిక్కర్లు కనిపిస్తున్నాయి. ఇలా ప్రతి నియోజకవర్గంలో స్టిక్కర్లు, బోర్డులు వెలుగులోకి వస్తున్నాయి. వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు ఏపీవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు.