పిల్లలకు పోలియో చుక్కలు..మార్చి 3న
6th sense TV: AP: రాష్ట్రవ్యాప్తంగా మార్చి 3న పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టనున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. 53.35 లక్షల మంది 5 ఏళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. అంగన్వాడీలు, గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్లతో ANMలు సమన్వయం చేసుకోవాలని సూచించారు.