పి.డి.ఎస్(చౌక బియ్యం)కొనడం, అమ్మడం చేస్తే సదరు వ్యక్తుల పైచట్టపరమైన చర్యలు తీసుకుంటాం….
6th sense TV: రాజమహేంద్రవరం:*రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి వారి కార్యాలయము,*
కాకినాడ జిల్లాలోని సోమర్లకోట పట్టణ సమీపములో అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనం నంబర్ TS28 TB 3127 లో పి.డి.ఎస్(రేషన్ బియ్యం)తో వెళ్ళుతుంది అన్న సమాచారముతో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో సదరు వాహనంను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా, సదరు వాహనం నందు గల 91 ప్లాస్టిక్ బస్తాలలో సుమారు 4357 కేజీల పి.డి.ఎస్ బియ్యంను గుర్తించటమైనది. సదరు పి.డి.ఎస్ బియ్యంను తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం మండలములోని మెదర బస్తి గ్రామమునకు చెందిన వాహన యజమాని శ్రీ ఎ. పవన్, తండ్రి మేఘరాజు వారు సేకరించి కొత్తగూడెం మండలములోని హేమచంద్రపురంనకు చెందిన డ్రైవర్లు చందు మరియు పి. సాయి భారత్ ల ద్వారా కొత్తగూడెం మండలములోని పాల్వంచ గ్రామము నుండి కాకినాడకు రవాణా చేయుచున్నారు. సదరు పి.డి.ఎస్ బియ్యంను అక్రమముగా తరలించుట కారణముగా సుమారు రూ 9,98,243/- లు విలువ గల 4357 కేజీల పి.డి.ఎస్(రేషన్ బియ్యం)ను మరియు పైన తెలిపిన వాహనంను సివిల్ సప్లయ్స్ అధికారులు, సోమర్లకోట వారు సీజ్ చేసి 6-ఏ క్రింద కేసు నమోదు చేసి సదరు పి.డి.ఎస్(రేషన్ బియ్యం) ఓనర్ మరియు వాహన యజమాని, వాహనం డ్రైవరులు మరియు సంబందిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు కొరకు పోలీసు స్టేషన్ కు సిఫారసు చేయటమైనది.
*ఈ సందర్భముగా రీజనల్ విజిలెన్స్ ఎస్.పి. శ్రీ కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డి, ఐ.పి.ఎస్ గారు మాట్లాడుతూ రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోని మూడు జిల్లాలలో పి.డి.ఎస్(చౌక బియ్యం) అక్రమ నిల్వలు, అక్రమ రవాణా పై నిరంతరం నిఘా కొనసాగుతుంది అని, ఎవ్వరైనా పి.డి.ఎస్(చౌక బియ్యం) కొనడం, అమ్మడం చేస్తే సదరు వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని తెలిపియున్నారు.*
ఈ తనిఖిలలో విజిలెన్స్ అధికారులు నాగ వెంకట రాజు, లక్ష్మీనారాయణ, సి.ఎస్.డి.టి కీర్తి మరియు జీవానందం పాల్గొన్నారు .