పోలీసులపై ప్రముఖ హీరోయిన్ ఫైర్…?
6th sense TV: హైదరాబాద్:
సినీనటి నివేథ పేతురాజ్ అంటే సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేదు. అయితే ఆమె తాజాగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె వెళ్తున్న కారును పోలీసులు ఆపి, తనిఖీ చేయాలి..డిక్కీ ఓపెన్ చేయాలని కోరగా.. ఆమె అందుకు నిరాకరించారు. అది పరువుకు సంబంధించిన మ్యాటర్ అని, మీకు చెప్పినా అర్థం కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పక్కనే ఓ వ్యక్తి ఇదంతా రికార్డ్ చేయగా.. అతనిపై ఫైర్ అయ్యారు.