పోలీస్ కస్టడీలో జానీ మాస్టర్
6th sense TV: రంగారెడ్డి జిల్లా:
కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అత్యాచారం కేసులో వాస్తవాల కోసం జానీ మాస్టర్ ను తను కస్టడీకి ఇవ్వాలని రంగారెడ్డి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు 4 రోజుల పోలీస్ కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది. దీంతో పోలీసులు అతడిని చంచల్ గూడ జైలు నుంచి నార్సింగి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే ఇక్కడే జానీని పోలీసులు విచారించనున్నారు.