పోస్టల్ బ్యాలట్ దరఖాస్తు గడువు పొడిగింపు..
6th sense TV:అమరావతి:పోస్టల్ బ్యాలట్ దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 26 వరకు గడువును పెంచుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్ కుమార్ మీనా నిర్ణయం తీసుకున్నారు.
ఉద్యోగులు ఎక్కడ ఉన్నా.. పని చేసే చోటే ఫాం-12 ఇవ్వవచ్చని తెలిపారు.
పోస్టల్ బ్యాలట్ సమర్పణ విషయంలో ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సీఈఓ ఈ మేరకు శనివారం స్పష్టతనిచ్చారు.