*ప్రజా సమస్యల పరిష్కార వేదిక*
6th sense TV:*కాకినాడ జిల్లా: పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్, IPS.*
ఈరోజు కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో, జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది.
ఈరోజు ఈ కార్యక్రమమునకు 82 మంది ఫిర్యాదుదారులు హాజరై తమ సమస్యలను జిల్లా ఎస్పీ గారికి స్వయంగా తెలియచేసుకున్నారు.
ప్రజల నుండి జిల్లా ఎస్పీ గారు నేరుగా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, సంబంధిత పోలీస్ అధికారులతో నేరుగా మాట్లాడి, సకాలంలో సమస్యలు పరిష్కరించవలసిందిగా ఆదేశాలు, సూచనలు ఇచ్చారు.
జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేనటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లలోను, సర్కిల్ కార్యాలయాలలోను, సబ్ డివిజన్ కార్యాలయాలలో ఫిర్యాదు చేయవచ్చునని, ఆ ఫిర్యాదులను ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులుగానే పరిగణించి, సకాలంలో సత్వర న్యాయం చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీగారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పరిపాలన శ్రీ MJV భాస్కర రావు, DTRB సీఐ శ్రీ ఎస్.గౌరి శంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.