ఫోటోగ్రాఫర్ పై దాడి
ఫోటోగ్రాఫర్ పై దాడికి ఖండన:
అనంతపురం జిల్లా రాప్తాడు లో ముఖ్యమంత్రి సిద్ధం సభ కవరేజ్ కు వెళ్లిన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై వైసీపీ నాయకులు,అల్లరి మూకలు దాడి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్, ఏ .పి.ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్, ఏ .పి.ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ తీవ్రంగా
తీవ్రంగా ఖండిస్తన్నాయి. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై జరిగిన దాడిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా పరిగణించి దాడి చేసిన వారిపై తక్షణమే కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్, ఏ .పి.ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్, ఏ .పి.ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నాయి.
అలానే అమరావతిలో ఇసుక మాఫియా కవరేజ్ కి వెళ్ళిన ఈనాడు విలేకరిపై జరిగిన దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం.
విలేకరులపై జరిగిన దాడులపై సీఎం సత్వరమైన చర్యలకు ఆదేశించకపోతే ఏపీయూడబ్ల్యూజే, ఏపీఈఎంజేఏ లు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతాయని హెచ్చరిస్తున్నాము. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.