భర్త, ప్రియుడు.. ఇద్దరూ కావాలి…?
విద్యుత్ స్తంభం ఎక్కి మహిళ నిరసన! వీడియో వైరల్
ఆమె ముగ్గురు పిల్లల తల్లి. భర్త, పిల్లలతో ఎంతో సంతోషంగా సాగిపోతుంది ఆమె కాపురం. అయితే భర్తకు తెలియకుండా ఆమె ప్రియుడితో రహస్యంగా సంబంధం పెట్టుకుంది. ఈ విషయం బట్టబయలు కావడంతో తనకు భర్తతోపాటు ప్రియుడు కూడా కావాలంటూ మొండిపట్టు పట్టింది. కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించక పోవడంతో.. సదరు మహిళ కరెంట్ స్తంభం ఎక్కి నిరసన వ్యక్తం చేసింది. తాను భర్త, ప్రియుడు ఇద్దరితో కలిసి ఉంటానని, అందుకు అంగీకరిస్తేనే కిందికి దిగివస్తానని డిమాండ్ చేసింది. గమనించిన స్థానికులు .. ఆమెను కాపాడేందుకు యత్నించారు.
ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో బుధవారం (ఏప్రిల్ 3) చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.