*భీమేశ్వరస్వామిని దర్శించుకున్న ఎస్పీ దంపతులు*
6th sense TV: కాకినాడ జిల్లా : సామర్లకోట:
*పంచారామ క్షేత్రంలో ఒకటైన సామర్లకోట శ్రీచాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామిని కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ దంపతులు దర్శించుకున్నారు.కార్తీక మాస మహా పర్వదినాలు పురస్కరించుకుని జిల్లా ఎస్పీ సోమవారం సాయంత్రం ఆలయానికి చేరుకుని,స్వామివారిని,అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అంతకుముందు ఆలయానికి చేరుకున్న జిల్లా ఎస్పీ దంపతులకు ఆలయ ఈవో బళ్ల నీలకంఠం ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.ఆలయంలో స్వామి వారి,అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ నంది మండపంలో ఎస్పీ దంపతులకు వేద స్వస్తి పలికి తీర్థప్రసాదాలను అందజేశారు.*