మరిగే నీటిని మర్మాంగంపై పోసి హత్యాయత్నం
*
6th sense TV:పల్నాడు జిల్లా:
నిద్రిస్తున్న భర్త మర్మాంగంపై సలసల మసిలే నీటిని పోసి భార్య హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్లో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గ్రామానికి చెందిన నాయిని ప్రభుదాసు, అనూషాలు గత కొన్ని రోజుల నుండి హనుమాన్ నగర్ 13వ లైన్ లో నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాలతో కొన్ని నెలలుగా వేరుగా భార్యాభర్తవేరుగా ఉన్నారని, ఇటీవల నాలుగు నెలల క్రితం పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ చేసి తన భార్య తల్లిదండ్రులు మునగాల సుబ్బారావు, అకమ్మ లు కాపురానికి పంపడం జరిగిందన్నారు. వినకొండలో నెలవారి వాయిదాల పద్ధతిలో వ్యాపారం చేసుకుంటూ హనుమాన్ నగర్ లో నివాసం ఉంటూ తన భార్యని వారం క్రితం వినకొండకు తీసుకురావడం జరిగిందన్నారు. అయితే లుంగీ కట్టుకొని నిద్రిస్తున్న తన మర్మాంగంపై సలసల మసిలే నీటిని పోసి హత్యాయత్నం చేసిందని బాధితుడు రోధిస్తూ వాపోయాడు. తన భార్య తల్లిదండ్రులు సుబ్బారావు, అక్కమ్మ వారి కుటుంబ సభ్యులు ఒక పథకం ప్రకారం తన భార్యతో ఇలా చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించాడు. మర్మాంగం కాలిపోయి తీవ్ర గాయాలతో బాధితుడు వినకొండ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు వినుకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యాయత్నానికి పాల్పడిన అనూషను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.